ALL SSD COUNTERS SHOULD GET READY BY JANUARY _ జనవరి చివరి నాటికి సమయ నిర్దేశిత శ్రీవారి సర్వదర్శనం పూర్తిస్థాయి కౌంటర్ల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 25 December 2017:The action plan and designing of permanent counters for Slotted Sarva Darshan (SSD) should get ready by January end, said TTD EO Sri Anil Kumar Singhal.

During the senior officers review meeting held at Annamaiah Bhavan in Tirumala along with JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar and CVSO Sri A Ravikrishna, the EO complimented the TTD officers and employees who carried out the trial-run in a successful manner in all the 117 counters located at 14 centres in Tirumala from December 18-23. Later he instructed that the IT application for SSD should be designed by TCS with more ease. “Make assessment of total counters, manpower, agency to be selected to operate the counters etc. required for the SSD counters at Tirumala and Tirupati so that we could able to launch it in a full-fledged manner by March “, he directed the engineering wing.

He later instructed the TTD PRO Dr T Ravi to see that the diaries and calendars which are booked on-line should reach the subscribers on time by postal department.CE Sri Chandra Sekhar Reddy, FACAO Sri Balaji and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జనవరి చివరి నాటికి సమయ నిర్దేశిత శ్రీవారి సర్వదర్శనం పూర్తిస్థాయి కౌంటర్ల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు :
టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

డిసెంబరు 25, తిరుమల 2017; తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు టిటిడి ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన సమయ నిర్దేశిత సర్వదర్శనం పూర్తిస్థాయి కౌంటర్ల నిర్మాణానికి అవసరమైన రూపకల్పనలు జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఉదయం తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌లతో కలసి సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 18వ తేది నుండి 23వ తేది వరకు 6 రోజుల పాటు తిరుమలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానంపై భక్తులు సంపూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ విధానాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి ఐటి అప్లికేషన్‌ను టిసిఎస్‌ ద్వారా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రస్తుతం వాడిన సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టాలని, భక్తులు సులువుగా టోకెన్లు పొందేందుకు వీలుగా తయారు చేయాలని సూచించారు. అదేవిధంగా మార్చి నెలలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా తిరుమల, తిరుపతిలో ఏ ఏ ప్రాంతాలలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి, కౌంటర్ల నిర్మాణానికి అవసరమైన రూపకల్పనలు తయారు చేయాలన్నారు. సదరు కౌంటర్ల నిర్వహణకు ఏజెన్సీని ఖరారు చేయాలని, ఏజెన్సీ ఎంపికకు అవసరమైన విది, విధానాలు తయారు చేయాలని అన్నారు.

అంతకుముందు ఆన్‌లైన్‌లో 2018 డైరీలు, క్యాలెండర్లు రిజర్వు చేసుకున్న భక్తులకు తపాలాశాఖ ద్వారా సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ప్రజాసంబంధాల అధికారి డా. టి. రవిని ఆదేశించారు.పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్‌ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.