ALL TYPES OF CANCERS UNDER FREE TREATMENT-CM OF AP _ అన్ని రకాల క్యాన్సర్లకు ఉచిత చికిత్స : ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ. వైఎస్.జగన్మోహన్ రెడ్డి
INAUGURATES SVICCAR IN TIRUPATI
DR NORI COMPLIMENTS CM’s VISION ON CANCER TREATMENT
TIRUPATI, 05 MAY 2022: As a part of the Andhra Pradesh Government’s chief motto of comprehensive cancer care in the state, all types of cancers are brought into the bracket of free treatment, said the Honourable CM of Andhra Pradesh, Sri YS Jaganmohan Reddy.
After inaugurating the Sri Venkateswara Institute of Cancer Care and Research (SVICCAR) by TATA Trust in the Temple City of Tirupati on Thursday afternoon, speaking on the occasion, the CM said, it is a welcoming gesture by TATAs to set up a masterpiece cancer care institution in Tirupati. “With this initiative of TATAs collaborating with TTD and State Government of Andhra Pradesh will definitely address the gap of cancer care infrastructure in the state providing quality medi-care for cancer to the needy at an affordable price”, he expressed.
Adding further he said, the State Government has requested TTD get into the medical services in a big way for the benefit of many suffering. The ultimate goal is that no single patient shall die of cancer in the state or rush to neighbouring states for treatment.
He said with the cooperation of TATA and renowned Oncologist Dr Nori Dattatreyudu, the state government aims to set up State-of-Art Oncology centre soon.
Earlier in his address on the occasion, renowned Radiation Oncologist and Advisor to AP Government Dr Nori Dattatreyudu complimented the CM for his vision on cancer care and treatment. He said the Chief Minister is committed to construct three comprehensive cancer hospitals across the state. He also suggested to have Paediatric Onchology Center, Preventive Onchology, Center for Pain and Palliative Care as AP is the only state in India which has realized the importance of Cancer treatment, he maintained.
Earlier the CM has also shown a five minute AV on TATA cancer care. The CEO of TATA Trusts Sri N Srinath, Chief Executive of ACF Dr Sanjiv Gupta and other doctors were introduced to the CM of AP.
Later Dr VR Ramanan, the Medical Director of SVICCAR explained the CM on various facilities available and said the TATA cancer care has developed on four pillars including enhanced access, uniform high quality care, affordable care and early detection through awareness programs. He had also shown the equipment, true beam lab and other diagnosing units present in the hospital and explained their functioning.
Ministers Smt V Rajani, Sri P Ramachandra Reddy, Sri Narayana Swamy, Smt RK Roja, MLAs Sri Karunakar Reddy, Sri C Bhaskar Reddy, MLC Sri Srinivasulu Reddy, TMC Mayor Dr Sirisha, Deputy Mayor Sri Abhinay and others were also present.
TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, board members Sri Maruti Prasad, Sri Sanjeevaiah, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore and other officials were present.
Secretary to CM Sri Solomon Arokiaraj, District Collector Sri Venkatrami Reddy, SP Sri Parameshwara Reddy and other state government and district officials, SVIMS Director Dr Vengamma were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
అన్ని రకాల క్యాన్సర్లకు ఉచిత చికిత్స : ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ. వైఎస్.జగన్మోహన్ రెడ్డి
తిరుపతిలో స్వీకార్(SVICCAR)కు శ్రీకారం
క్యాన్సర్ చికిత్సపై దృష్టి పెట్టిన సీఎంను అభినందించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
మే 05, తిరుపతి 2022 : రాష్ట్రంలో సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా అన్ని రకాల క్యాన్సర్‌లకు ఒకే గొడుగు కింద ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ (స్వీకార్) అసుపత్రిని గురువారం మధ్యాహ్నం గౌ.ముఖ్యమంత్రివర్యులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా గౌ.ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ టాటా సంస్థ అద్భుతమైన క్యాన్సర్ అసుపత్రిని ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఈ ఆసుపత్రికి టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తాయని, ఇక్కడ అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం తక్కువ ధరకు రోగులకు అందుతుందని తెలిపారు.
పేదరోగులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం టిటిడిని కోరిందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్‌తో చనిపోకూడదని లేదా చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనేది తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. టాటా సంస్థ, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అత్యాధునిక అంకాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
అంతకుముందు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ క్యాన్సర్ సంరక్షణ, చికిత్సపై సీఎం దూరదృష్టిని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్, ప్రివెంటివ్ ఆంకాలజీ, సెంటర్ ఫర్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్‌ను ఏర్పాటు చేయాలని, భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని ఆయన చెప్పారు.
అంతకుముందు సీఎంకు టాటా క్యాన్సర్ కేర్ ఆసుపత్రిపై 5 నిమిషాల విజువల్ చూపించారు. టాటా ట్రస్ట్ సీఈవో శ్రీ ఎన్.శ్రీనాథ్ ఈ సందర్భంగా ఏసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ సంజీవ్ గుప్తా, ఇతర వైద్యులను సీఎంకు పరిచయం చేశారు. అనంతరం స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వీఆర్.రమణన్ అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు. టాటా క్యాన్సర్ కేర్ నాలుగు స్తంభాలపై అభివృద్ధి చెందిందని, ఇందులో మెరుగైన యాక్సెస్, యూనిఫాం హైక్వాలిటీ కేర్, అఫర్డబుల్ కేర్ మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా ముందస్తుగా గుర్తించడం వంటి అంశాలు ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో ఉన్న పరికరాలు, ట్రూ బీమ్ ల్యాబ్ మరియు ఇతర రోగనిర్ధారణ యూనిట్లను వాటి పనితీరును వివరించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, మంత్రులు శ్రీ పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీమతి ఆర్కే రోజా, శ్రీమతి విడదల రజని,ఎమ్మెల్యేలు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ శ్రీ అభినయ్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ మారుతీ ప్రసాద్, శ్రీ సంజీవయ్య, జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ నరసింహ కిషోర్, సిఎం కార్యదర్శి శ్రీ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామి రెడ్డి, ఎస్పీ శ్రీ పరమేశ్వర రెడ్డి , స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, రాష్ట్ర ప్రభుత్వ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.