AMARAVATI SV TEMPLE WORKS MUST BE COMPLETED ON TIME: TTD JEO DR. A SHARATH _ అమరావతి ఎస్వీ ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్
Amaravati / Tirupati | October 11, 2026: TTD JEO Dr. A. Sharath directed officials and contractors to complete the construction of the Sri Venkateswara Swamy Temple at Venkatapalem in Amaravati within the scheduled deadline.
On Sunday night, he inspected the construction works along with officials and reviewed their progress. He noted that the construction of the compound walls and gopurams on the northern, southern and western sides was progressing well.
However, he expressed dissatisfaction over the slow progress of the eastern gopuram and instructed the contractor to speed up the work and complete it on time.
He also directed the officials to complete the construction of the Ranganayaka Mandapam, Vahana Mandapam, Pushkarini, Sri Anjaneya Swamy Temple and Ratha Mandapam within the stipulated time.
Earlier, officials and priests welcomed the JEO at the temple. After inspecting the works, he offered prayers to the deity, and the priests presented him with teertha prasadam.
Temple Inspector Sri Ramakrishna, Assistant Sri Rohit, priests, engineering officials and contractors participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
అమరావతి ఎస్వీ ఆలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలి : టీటీడీ జేఈవో డా. ఎ. శరత్
అమరావతి / తిరుపతి | అక్టోబరు 11, 2026: ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వేంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.
ఆదివారం రాత్రి ఆలయ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి, పురోగతిపై సమీక్షించారు. ఉత్తరం, దక్షిణం, పడమర వైపుల ప్రాకారాలు, గోపురాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొంటూ, తూర్పు గోపురం పనులు ఆశించిన లక్ష్యాలకు అనుగుణంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పు గోపురం పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
అదేవిధంగా రంగనాయకమండపం, వాహన మండపం, పుష్కరిణి, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం, రథమండపం నిర్మాణ పనులను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న జేఈవోకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకోగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ రామకృష్ణ, అసిస్టెంట్ శ్రీ రోహిత్, ఆలయ అర్చకులు, ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.







