ANKURARPANA FOR NAVARATRI BRAHMOTSAVAMS HELD _ శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

“SAMURTARCHANADHIKARANAM” GUIDES THE RITUAL PROCEDURE

Tirumala, 11 October 2026: Srivari Navaratri Brahmotsavams at Tirumala, scheduled from October 12 to 20, commenced on a grand spiritual note on Sunday evening with the traditional Ankurarpanam ceremony.

Senadhipati Sri Vishvaksena led a ceremonial procession along the four Mada Streets, symbolically inspecting the arrangements for the celestial festival. Later, the Ankurarpanam ritual was performed in the Yagashala strictly in accordance with the Vaikhanasa Agama traditions.

Sacred seeds are sown with the sankalpa that the nine-day Brahmotsavams may be celebrated successfully and with the divine blessings of  Sri Venkateswara Swamy.

The healthy sprouting of these seeds is considered an auspicious sign for the grand and successful conduct of the festival.

Ritual under Moon light:

Invoking the blessings of Brahma, Garuda, Sesha, Sudarsana, Vakratunda, Soma, Shanta, Indra, Isana and Jaya through sacred fire rituals, the priests fill the palikas with soil after praying to Bhudevi. 

The seeds are then sown while invoking the blessings of Moon, followed by the sprinkling of water.

The palikas – mud pots were adorned with new cloth, after which Punyahavachanam was performed.

Somaraja Mantra chanted:

Recitations of the Somaraja Mantra, Varuna Mantra and Vishnu Suktam add to the sanctity of the occasion. 

The procedure for Ankurarpanam was detailed by Maharshi Atri in his treatise, Samurtarchanadhikaranam.

TTD Executive Officer Sri Muddada Ravichandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary, CVSO Sri Muralikrishna, Temple Deputy EO Sri Bhaskar and other officials participated in the ceremony.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమ‌ల‌, 2026 అక్టోబ‌ర్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబ‌రు 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అంకురార్ప‌ణ సంద‌ర్భంగా సేనాధిప‌తి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ ఏర్పాట్ల‌ను పర్యవేక్షించారు. అనంతరం వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

విశిష్టత..

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

సూర్యాస్తమయం తరువాతే..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని సస్యకారక అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.

అంకురార్పణ క్రమం..

విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన సముర్తార్చన అధికరణ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.

అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.

ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ ర‌విచంద్ర‌, అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్.వెంక‌య్య చౌద‌రి, సీవీఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌, శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ భాస్క‌ర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.