AMNAYAKSHI AMMA TEMPLE BTUs FROM AUGUST 21_ ఆగస్టు 21 నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 14 August 2018: The temple management of Tirumala Tirupathi Devasthanams is set to observe annual fete in the famous temple of Goddess Avanakshamma who is also popularly known as Amnakshi Amma, located in Narayanavanam in Chittor district from August 21 to September 7 in a grand manner.

This temple is under the management of TTD since 1967. TTD has organised ‘Jeernodharana Maha Kumbhabhishekam on August 14 in 2014.

Legend: It is believed that the demon ‘Somakudu’ stolen ‘The Vedas’ from the Lord Brahma. Goddess Paravathi Devi killed the demon and returned the Vedas to Lord Brahma. The Goddess has appeared as ‘Kalika Matha’ while killing the demon. In a thanks giving feature, Lord Brahma installed the small idol of Goddess and named as ‘Amnayakshi(Amna means Vedas and Sakshi means Eyes).

Later, Sage Agasthyawas installed a huge replica idol of the Goddess Amnayakshi. King Akasha Raja(Father of Goddess Padmavathi Devi) worshipped the Goddess and constructed a temple for the Goddess. Sri Padmavthi Devi offered prayers before her marriage with Sri Venkateswara Swamy.

She performed ‘Gowri Pooja’ and ‘Rudraabhishekam’ in this temple. It was described in ‘PADMAVATHI PARINAYAM’ that Goddess Padmavathi devi and the Lord worshipped the Goddess ‘Avanakshamma’ before going to Tirumala Temple after their marriage.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 21 నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2018 ఆగస్టు 14: టిటిడి ఆధ్వర్యంలోని నారాయణవనం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న సముదాయం గ్రామంలోని శ్రీ ఆమ్నాయాక్షి(అవనాక్షి) అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21వ తేదీ నుండి సెప్టెంబరు 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు (జాతర) వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతి మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆగస్టు 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు అమ్మవారికి అభిషేకం, రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు కంకణ ధారణ నిర్వహించనున్నారు. ఆగస్టు 28వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు అభిషేకం, సెప్టెంబరు 4వ తేదీన ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.

సెప్టెంబరు 5వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు సముదాయం గ్రామంలో ఊరేరగింపు, సెప్టెంబరు 6వ తేదీ సాయత్రం 6.00 గంటల వరకు కీలాగారం గ్రామాలలో శ్రీ ఆమ్నాయాక్షి అమ్మవారు ఊరేగి గ్రామస్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. సెప్టెంబరు 7వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి నారాయణవనం, సముదాయం, కీలాగారం గ్రామాలలో అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఆలయ ప్రాశస్త్యం

ఆమ్నాయాక్షి అనగా వేదాలే కళ్లుగా గల అమ్మవారు అని అర్థం. ఈ ఆలయంలోని అమ్మవారిని చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠించినట్టు ఐతిహ్యం. నారాయణవనం ఆలయాన్ని 1967, ఏప్రిల్‌ 9న టిటిడి తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో పాటు పురాతన ఆమ్నాయాక్షి అమ్మవారి ఆలయం కూడా టిటిడి పరిధిలోకి వచ్చింది. నారాయణవనాన్ని పాలించిన శ్రీపద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశరాజు వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.