ANANTA PADMANABHA VRATAM CHAKRASNANAM HELD _ అనంత పద్మనాభవ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం
Tirumala, 19 September 2021: As part of Ananta Padmanabha Vratam festivities, the holy ritual of Chakrasnanam was performed at the Srivari Pushkarini in Tirumala on Sunday morning in Ekantam in adherence to Covid guidelines.
The Ananta Padmanabha Vratam is observed in Tirumala on Bhadrapada Shukla Chaturdasi day. After Nitya Kainkaryams the utsava idol of Sri Sudharshana Chakrattalwar is taken out in procession and abhisekam was performed at Swami Pushkarini near Sri Varaha Swamy temple. Thereafter Chakrasnanam is conducted at the Pushkarini.
Legends hail the significance of Ananta Padmanabha Vratam to be performed at all the 108 Sri Vaishnava Divya kshetras.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అనంత పద్మనాభవ్రతం సందర్భంగా శాస్త్రోక్తంగా చక్రస్నానం
తిరుమల, 2021 సెప్టెంబరు 19: తిరుమలలో అనంత పద్మనాభవ్రతం సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమం ఏకాంతంగా జరిగింది.
అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు.
శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.