ANANTA PADMANABHA VRATHAM ON SEPTEMBER 28 IN TIRUMALA _ సెప్టెంబర్ 28న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

Tirumala, 27 September 2023: TTD will grandly organize Anantha Padmanabha Vratam on September 28 in Tirumala.

 

On this occasion, at 6 am on Thursday, Sri Sudarshana Chakratthalwar will be brought from Tirumala temple to Swamy Pushkarini situated near Sri Bhu Varaha Swamy temple on a procession. 

 

The priests perform a special Abhishekam followed by a holy dip of Sudarshana Chakratthalwar and then return to the temple.         

 

Ananta Padmanabha Vratam is held every year in 108 Sri Vaishnava temples across the country on this day.  As Tirumala is the premiere of the 108 Sri Vaishnava divine places, the Ananta Padmanabha Vratam is performed by the priests in a big way. 

 

Chakrasanam is performed four times a year on the last day of Srivari Brahmotsavam in Tirumala, Vaikuntha Dwadashi, Rathasapthami and Ananta Padmanabhavratham.

 

TTD officials and temple priests will participate in this program.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సెప్టెంబర్ 28న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

తిరుమల, 27 సెప్టెంబరు 2023: తిరుమలలో సెప్టెంబ‌రు 28వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.

ఈ సందర్భంగా ఉదయం 6 గంట‌లకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీభూవరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.

కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి అంతే వైశిష్ఠ్యం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వస్తారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రస్నానం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పాల్గొంటారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.