SPIRITUAL BOOK RELEASED BY TIRUMALA PONTIFF _ ‘ది డివైన్ హిస్టరీ ఆఫ్ శ్రీ అనంతాళ్వాన్’ ఆధ్యాత్మిక గ్రంథం ఆవిష్క‌ర‌ణ‌

Tirumala,  27 September 2023: HH Tirumala Sri Pedda Jeeyangar Swamy along with his deputy,  HH Chinna Jeeyangar of Tirumala released a Tamil book on ‘The divine history of Sri Anantalwan’, brought out by The Hindu group of publications, at Tirumala on Wednesday.

Speaking on the occasion the Senior Pontiff of Tirumala said the book throws light on the history of the great Sri Vaishnavite Saint Anantalwar who lived on Tirumala hills during the period 1053 – 1138.

 

He said Anantalwan pioneered Pushpa Kainkaryam to the Tirumala shrine by developing a flower garden and offered garlands to the temple everyday. ”And today this book is released on the auspicious day Bagh Savari which is observed in Anantalwar Gardens”, he observed.

 

The seer called on to the devout to read the book to understand the power of devotion towards a Guru.

 

The book was originally written in Telugu by Mr. P. V. Rami Reddy, a devotee of Hyderabad, and translated by Ms. Raji Ragunathan in Tamil.

 

The Hindu Business Line Editor Raghuvir Srinivasan, Vice President (Sales & Distribution) Sridhar Aranala, Special Publications in-charge R. Srinivasan and Cluster head (AP, TS, Odisha) S.D.T. Rao were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

‘ది డివైన్ హిస్టరీ ఆఫ్ శ్రీ అనంతాళ్వాన్’ ఆధ్యాత్మిక గ్రంథం ఆవిష్క‌ర‌ణ‌

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 27: ది హిందూ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్ వారు ముద్రించిన‌ ‘ది డివైన్ హిస్టరీ ఆఫ్ శ్రీ అనంతాళ్వాన్’ అనే తమిళ పుస్తకాన్ని తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి క‌లిసి బుధవారం తిరుమలలో విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి మాట్లాడుతూ, 1053 – 1138 మధ్య కాలంలో తిరుమల కొండపై నివసించిన శ్రీ వైష్ణవ భ‌క్త‌గ్రేశుడు అనంతాళ్వార్ చరిత్రను ఈ గ్రంథం వెలుగులోకి తెస్తోందన్నారు.

అనంతాళ్వాన్ తిరుమల పుణ్యక్షేత్రంలో పుష్ప కైంకర్యం ప్రారంభించారని, పూలతోటల‌ను అభివృద్ధి చేసి, ప్రతిరోజూ ఆలయానికి పూలమాలలు సమర్పించారని అన్నారు. ”అనంతాళ్వార్ తోట‌లో జరుపుకునే పవిత్రమైన బాగ్ సవారీ రోజున ఈ పుస్తకం విడుదల చేయబడింది” అని ఆయన చెప్పారు.

గురువు పట్ల భక్తి, శక్తిని అర్థం చేసుకోవడానికి పుస్తకాన్ని చదవాల‌ని భక్తులకు ఆయ‌న పిలుపునిచ్చారు.

ఈ పుస్తకాన్ని మొదట తెలుగులో హైదరాబాద్ భక్తుడైన శ్రీ పి.వి. రామి రెడ్డి రాశారు. దీనిని తమిళంలో శ్రీమతి రాజి రఘునాథన్ అనువదించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ది హిందూ బిజినెస్ లైన్ ఎడిటర్ రఘువీర్ శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ & డిస్ట్రిబ్యూషన్) శ్రీధర్ అరనాల, స్పెషల్ పబ్లికేషన్స్ ఇన్‌ఛార్జ్ ఆర్. శ్రీనివాసన్ మరియు క్లస్టర్ హెడ్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఒడిశా) ఎస్‌డిటి రావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది