ANANTALWAR AVATAROTSAVAM OBSERVED _ తిరుమలలో ఘనంగా శ్రీ అనంతాళ్వారు 969వ అవతారోత్సవం 

TIRUMALA, 19 FEBRUARY 2023: The 969th Avatarotsavam of Sri Anantalwar was observed at Purusaivari Tota on Sunday at Tirumala.

Anantalwar, the great Sri Vaishnavait Saint and pioneer of Pushpa Kainkaryam at Tirumala temple survived for 102 years in the service of Sri Venkateswara Swamy.

His successors from all over the country assembled at Purusaivari Tota and recited Nalayira Divya Prabandham.

HH Sri Pedda Jeeyangar Swamy of Tirumala in his Anugraha Bhashanam on the occasion said, it is great to see that the successors of Anantalwar are taking forward his legacy uninterruptedly for the sake of future generations.

In his religious discourse, HH Sri Chinna Jeeyangar Swamy of Tirumala said the pious life of Sri Anantalwar is a role model to everyone who wishes to perform selfless service to Sri Venkateswara.

Later they released two books on the occasion including Bhakti – Mukti by Smt Vijayalakshmi and another Kannada book.

Sri Tatacharyulu belonging to the Anantalwar clan, All Projects Programme Officer Smt Vijayalakshmi, Alwar Divya Prabandha Co-ordinator Sri Purushottam and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో ఘనంగా శ్రీ అనంతాళ్వారు 969వ అవతారోత్సవం
 
ఫిబ్రవరి 19, తిరుమల 2023: శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 969వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్‌తోటలో (పురశైవారితోట) ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా  అనంతళ్వారు వంశీకులు ”నాలాయిర దివ్యప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి అనుగ్రహభాషణం చేస్తూ 102 ఏళ్ళ సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్పకైంకర్యాన్ని ప్రారంభించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్‌ అని కొనియాడారు. అనంతాళ్వారు వంశీకులు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావహమన్నారు.  
 
అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి అనుగ్రహభాషణం చేస్తూ తిరుమలలో వివిధ రకాల సుగంధభరిత పుష్పాల మొక్కలతో కూడిన పుష్పాల తోటను ఏర్పరచి, తన జీవితాన్ని భగవంతుని పాదాలవద్ద పుష్పంగా సమర్పించుకున్నారని ఆనంతాళ్వార్‌ జీవిత వైశిష్ట్యం గురించి వివరించారు.
 
పుస్తకావిష్కరణలు
 
ఈ సందర్భంగా హైదరాబాదుకు చెందిన శ్రీమతి బసవరాజు విజయలక్ష్మి రచించిన “భక్తి – ముక్తి” అనే పుస్తకాన్ని, అనంతాళ్వార్ పై మరో కన్నడ పుస్తకాన్ని శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి ఆవిష్కరించారు. ఇందులో అనంతాళ్వార్ తిరుమల శ్రీవారికి చేసిన కైంకర్యం తదితర వివరాలను కూడా పొందుపరిచారు.
 
ఈ సందర్భంగా వేంకటాచల ఇతిహాసమాల, రామానుజులవారి తిరుమల యాత్ర, స్వామి పుష్కరిణి వైభవం, శ్రీ రామాయణ కాలక్షేపం, తిరుమలనంబి – తన్నీరముదు ఉత్సవం, మూలవర్ల తిరుమంజనం – తిరునామం, తిరుమలలో రామానుజ సన్నిధి ప్రతిష్ట, సహస్రనామార్చన వైభవం, తిరుమలలో జీయర్ మఠం స్థాపన, శ్రీవారి సుప్రభాతం-ఏకాంత సేవ, తిరుమలలో దివ్యప్రబంధ క్రమం, తిరుమలలో పుణ్య తీర్థాలు తదితర అంశాలపై వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పండితులు ఉపన్యసించారు.
 
ఈ కార్యక్రమంలో అనంతాళ్వార్‌ వంశీకులు శ్రీ తాతాచార్యులు, టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీమతి విజయలక్ష్మి, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.