GRAND ANDAL TIRUVADIPURAM UTSAVAM BEGINS AT SRI GT_ ఘనంగా ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ప్రారంభం
Tirupati, 25 Jul. 19: The Sri Andal Tiruvadipuram festival began in a grand manner at Sri Govindaraja Swamy temple on Thursday morning.
As a part of it, holy event snapana thirumanjanam was performed to Sri Andal Ammavaru in the morning and paraded on the mada streets in the evening.
On Friday July 26, Rohini Asthanam of Sri Andal Ammavaru will be conducted. The festival will conclude on August 3.
On August 1 the Sattumora of Sri Chakrathalwar will also be performed during which utsava idol of Sri Govindaraja Swamy with His consorts will be paraded in the evening.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఘనంగా ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ప్రారంభం
తిరుపతి, 2019 జూలై 25: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉదయం శ్రీ ఆండాళ్ అమ్మవారికి వేడుకగా తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
జూలై 28వ తేదీ సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతోపాటు రోహిణీ ఆస్థానం, జూలై 26, ఆగస్టు 2వ తేదీల్లో శుక్రవార ఆస్థానం చేపడతారు. ఆగస్టు 3వ తేదీన ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్ క్వార్టర్స్, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్ మాడ వీధి, చిన్నజీయర్ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.