TWO GARUDA SEVAS IN AUGUST_ ఆగస్టులో రెండు సార్లు గరుడవాహనంపై శ్రీ‌వారి ద‌ర్శ‌నం

Tirumala, 25 Jul. 19: TTD plans to conduct holy and prestigious event of Garuda vahanam twice in the month of August.

Accordingly Sri Malayappaswamy will ride and bless devotees on Garuda vahanam on August 5 on the auspicious occasion of Garuda Panchami.

Again on August 15 as part of Sravana Pournami Sri Malayappa Swamy will be taken on Garuda vahanam to bless the devotees in Tirumala between 7pm and 9pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టులో రెండు సార్లు గరుడవాహనంపై శ్రీ‌వారి ద‌ర్శ‌నం

తిరుమల, 2019 జూలై 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 5వ తేదీన‌ గరుడ పంచమి, ఆగస్టు 15వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

ఆగస్టు 5న గరుడ పంచమి

ఆగస్టు 5వ తేదీ సోమ‌వారంనాడు గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ”గరుడపంచమి” పూజ చేస్తారని ప్రాశస్త్యం.

ఆగస్టు 15న శ్రావణ పౌర్ణమి

ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 15వ తేదీ గురువారంనాడు శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.