ANDAL SATTUMORA ON AUG 3_ ఆగస్టు 3వ తేదీన శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

Tirumala, 1 Aug. 19: Andal Tiruvadippodi Sattumora will be observed with religious fervour in Tirumala on August 3.

The processional deities will reach Purusaivari Thota on the evening of that day by 5.30pm and Prasada-Harati nivedanas will be rendered to the sacred Pogada tree (Styphnolobium japonacium)

Later the deities will return to the temple.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 3వ తేదీన శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

తిరుమల, 2019 ఆగస్టు 01: తిరుమలలో ఆగస్టు 3వ తేదీన శనివారం శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర ఘనంగా జరుగనుంది.

పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు.

ఈ పవిత్రమైనరోజు సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేస్తారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇస్తారు. ఆ శేషహారతి, పుష్పసరము, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పిస్తారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచుతారు. అక్కడ నుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.