PAVITROTSAVAMS AT TONDAMANADU FROM AUGUST 13-15_ తొండమనాడు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 1 Aug. 19: The annual Pavitrotsavams in Sri Bhu Sametha Sri Venkateswara Swamy temple at Tondamandu will be observed from August 13-15 with Ankurarpanam on August 12.

The wall posters for the same were released by Tirupati JEO Sri P Basant Kumar on Thursday in his chambers in TTD Administrative Building in Tirupati.

On first day Pavitra Pratista, second day Pavitra Samarpana and on final day Pavitra Purnahuti will be observed.

Temple DyEO Sri Subramanyam was also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తొండమనాడు శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2019 ఆగస్టు 01: టిటిడి అనుబంధ ఆలయమైన తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 13 నుండి 15వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను గురువారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్‌ కుమార్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆగస్టు 12న అంకురార్పరణంలో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 13న పవిత్ర ప్రతిష్ఠ, ఆగస్టు 14న పవిత్ర సమర్పణ, ఆగస్టు 15న మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.