GODA MALAS FOR SRIVARU… GODA PARINAYAM OBSERVED _ తిరుమల శ్రీవారికి గోదా మాలలు
Tirumala, 16 January 2024: Andal Sri Godamalas were decorated on Tuesday morning for Srivari Moolavirat, celebrating the Parinayotsav of Sri Godadevi.
Andal Sri Godamalas from Sri Govindarajaswamy temple in Tirupati were Special garlands were from Tirupati to Tirumala Pedda Jeeyar Swamy Mutt on Tuesday morning.
Later, they were brought to Srivari temple in a procession from Pedda Jeeyar Mutt.
Special pooja was performed in the temple of Sri Venkateswara Swamy and garlands were decorated to Moolavirat.
HH Tirumala Sri Sri Sri Pedda Jeeyar Swamy, HH Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala, JEO Sri. Veerabrahman, temple Deputy EO Sri Lokanatham and other officials were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారికి గోదా మాలలు
తిరుమల, 2024 జనవరి 16: శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు మంగళవారం ఉదయం అలంకరించారు.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియర్‌స్వామివారి మఠానికి మంగళ వారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్ మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జియర్ స్వామి, జేఈఓ
శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.