GARLANDS AND UMBRELLAS REACH TIRUMALA_ తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

Tirumala, 16 September 2018: The holy and sacred garlands (malas), popularly known as Goda Devi malas from Srivalliputhur temple (Tamil Nadu) made of tulasi, sevanthi and sampangi flowers reached Tirumala on Thursday for presentation to the presiding deity of Lord Venkateswara on Garuda Seva day on Friday.

The two garlands also known as Andal mala and Shikamani malas kept in big baskets were offered by two families of flower makers of Srivalliputhur, 650 kms from Tirupati, and were accompanied by around 50 devotees in several vehicles carrying the garlands on their heads.

Meanwhile, the colorful and bright umbrellas donated by the Chennai- based Hindu Dharmarta Samiti, meant for decorating the utsava idol of Lord Malayappaswamy on the Garuda Seva day finally reached Tirumala, a day before the main event of the ongoing Brahmotsavams.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమల శ్రీవారికి శ్రీవిల్లిపుత్తూరుమాలలు

సెప్టెంబరు 16, తిరుమల 2018: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి మాలలు ఆదివారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయంగార్‌ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడినుంచి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో మంగళవాయిద్యాల నడుమ ఆలయ నాలుగు మాడవీధుల గుండా ఊరేగింపుగా గోదాదేవిమాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగమన్నార్‌స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి శ్రీపెరియాళ్వార్‌ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన శ్రీ గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి ఆ తరువాత స్వామివారికి పంపేదని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్‌ తన కుమార్తెను మందలించారని, ఆ తరువాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను శ్రీరంగనాథుడు తిరస్కరించినట్టు చెప్పారు. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారమని తెలియజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో శ్రీ ర‌వీంద్రారెడ్డి, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్క‌సం బాధ్యులు శ్రీ గురురాజారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.