ANDAL SATTUMORA HELD _ తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర

Tirumala, 22 July 2023: Andal Tiruvadipuram Sattumora held in Tirumala on Saturday evening.

After Sahasra Deepalankara Seva the utsava deities visited Purusaivari Tota and special pujas were rendered near Pogada (spanish cherry) tree. Later the deities returned to the temple.

According to legend Andal was born in the advent of Ashada Sukla Chaturthi Tithi in Purva Phalguni star to Vaishnava devotee Sri Vishnuchitta in Tulasi garden.

DyEO Sri Lokanadham and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల‌లో శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర
       
తిరుమల, 2023, జూలై 22: తిరుమలలో శనివారం శ్రీ ఆండాళ్‌ తిరువడిపురం శాత్తుమొర  జరిగింది.

సాయంత్రం స‌హ‌స్ర‌దీపాలంకార సేవ అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. శేషహారతి, పుష్ప మాల‌, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడినుంచి స్వామి, అమ్మవార్లు తిరిగి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.