ANDAL SATTUMORA HELD IN GT _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌

TIRUPATI, 22 JULY 2023: Andal Sattumora was held in a grand manner in Sri Govindaraja Swamy temple at Tirupati on Saturday marking the completion of Sri Andal Tiruvadipuram Utsavam.

 

As part of it Snapana Tirumanjanam was observed in the morning followed by procession and Asthanam in the evening.

 

Both the seers of Tirumala, DyEO Smt Shanti and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌

తిరుపతి, 2023 జూలై 22: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ముగింపు సంద‌ర్భంగా శనివారం ఘ‌నంగా శాత్తుమొర జ‌రిగింది.

ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు . అనంతరం ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, సూప‌రింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్ రావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది