ANDAL TIRUVADIPPUDI UTSAVAM FROM JULY 17_ జూలై 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం

Tirupati, 14 Jul. 17: The Tiruvadipudi Utsavam of Andal Sri Godai in Sri Govindaraja Swamy temple will be observed from July 17 to 26. During these days, there will be Tirumanjanam of Ammavaru between 6 am to 6:30 am and procession in four mada streets between 5:30 pm to 6:30 pm.

On July 20 Rohini Asthanam, July 21 Friday(Sukravara) Asthanam will be performed. On July 26 there will be procession of Sri Govindaraja Swamy along with Ammavarlu. Meanwhile on the last day there will be Snapana Tirumanjanam to Swamy and Andal.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం

తిరుపతి, 2017 జూలై 14: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 17 నుండి 26వ తేదీ వరకు ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం 6.00 నుండి 6.30 గంటల వరకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

జూలై 20వ తేదీ రోహిణి ఆస్థానం, జూలై 21వ తేదీ శుక్రవారం ఆస్థానం నిర్వహిస్తారు. జూలై 26వ తేదీన ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుండి 8.00 గంటల వరకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.