EO INSPECTS CRO ALLOTMENT COUNTERS_ తిరుమలలో గదుల టోకెన్ల జారీ కేంద్రంలో ఈ.ఓ, జె.ఈ.ఓల తనిఖీలు

Tirumala, 14 Jul. 17: TTD EO Sri Anilkumar Singhal along with Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the room allotment counters through the newly introduced token system in CRO on Friday.

The TTD administrative chief official thoroughly observed the mode of registration, SMS system, room allotment in CRO. He later interacted with some pilgrims who hailed from Hyderabad, Chennai and Bengaluru and took feedback from them about the new system. The pilgrims also expressed their immense pleasure at this new system.

The EO later instructed the staffs of CRO to allot the rooms as desired by the pilgrims in the required tariff. He also instructed the Radio and Broad Casting department to make continuous announcements about the system, token serial number and rooms availability.

Earlier the EO, JEO inspected Rambhageecha and Nandakam rest house premises and instructed the concerned officials to see that no traffic problems arise during upcoming annual brahmotsavams in last week of September.

CVSO Sri A Ravikrishna, SE II Sri Ramachandra Reddy, VGO Sri Ravindra Reddy, Transport GM Sri Sesha Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో గదుల టోకెన్ల జారీ కేంద్రంలో ఈ.ఓ, జె.ఈ.ఓల తనిఖీలు

జూలై 14, తిరుమల, 2017: భక్తులు గదులకోసం ఎక్కువ సమయం వేచివుండకుండా ఇటీవల కేంద్రీయ విచారణ కేంద్రంలో ప్రవేశపెట్టిన టోకెన్ల జారీ కేంద్రంలో శుక్రవారం ఉదయం టి.టి.డి ఈ.ఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తిరుమల జె.ఈ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలసి తనిఖీలు నిర్వహించారు.

సి.ఆర్‌.ఓ కార్యాలయంలోని గదుల జారీ కౌంటర్లలో ఏర్పాటుచేసిన సౌకర్యాలపై భక్తులను ఈ.ఓ అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆయన మాట్లాడారు. గదుల కేటాయింపుపై ఈ.ఓ ముందు భక్తులు సంతోషం వ్యక్తపరిచారు. అటు తరువాత భక్తులకు గదులు ఎలా కేటాయిస్తున్నారు, భక్తులకు ఎదురవుతున్న సమస్యలు, తదితర అంశాలపై సిబ్బందికి ఈ.ఓ పలు సూచనలు చేసారు. భక్తుల ఇష్టాల మేరకు గదులను కేటాయించాలని అధికారులకు ఈ.ఓ ఆదేశించారు. సులభంగా, సౌకర్యంగా, పారదర్శకంగా భక్తులు గదులు పొందేందుకు ఏర్పాటుచేసిన టోకెన్ల జారీ విధానంపై తరచూ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌, ఎస్‌.వి.బి.సి ద్వారా ప్రకటనలు జారీచేయాలని సూచించారు. గదుల కేటాయింపు, అందుబాటులో ఉన్న గదుల వివరాలు, టోకెన్ల సీరియల్‌ నెంబర్ల వివరాలను భక్తులు సులభంగా గుర్తించేలా డిస్‌ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలన్నారు.

అంతకుముందు టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌. శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణలు కలసి రాంభగీచా, నందకం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సెప్ట్టెంబరు 23 నుండి అక్టోబర్‌ 1వ తేది వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలలో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, ట్రాఫిక్‌, తదితర అంశాలలో ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు ఈవో పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శ్రీ శేషారెడ్డి, రిసెప్సన్‌ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఈడీపీ మేనేజర్‌ శ్రీ భాస్కర్‌, ఓఎస్‌డీ శ్రీ బాలాజీ ప్రసాద్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.