ANIVARA ASTHANAM HELD _ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా ఆణివార ఆస్థానం
TIRUPATI, 17 JULY 2022: The annual Anivara Asthanam was held at Sri Kodanda Ramalayam in Tirupati on Sunday.
Sri Sita Lakshmana sameta Sri Rama was seated Infront of Garudalwar and Asthanam was performed.
Both the senior and junior Pontiffs, DyEO Smt Nagaratna, AEO Sri Durgaraju, Chief Priest Sri Ananda Kumar Deekshitulu, Superintendent Sri Ramesh and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కోదండరామాలయంలో ఘనంగా ఆణివార ఆస్థానం
తిరుపతి, 2022 జూలై 17: తిరుపతి శ్రీ కోదండరామాలయంలో ఆదివారం సాయంత్రం ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. ఆలయంలోని గరుడాళ్వార్ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు.
ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం రోజు నుండి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ దుర్గరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనంద్‌కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.