SV BALAMANDIR ADMISSIONS _ ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
TIRUPATI, 17 JULY 2022: TTD has invited applications from eligible candidates for admissions into SV Balamandiram – TTD-run school for orphans for the academic year 2022-23.
The applicants should hail from Andhra Pradesh and profess Hindu religion only. The candidates should be aged below 5 years to 10 years.
The candidates should furnish their details on a white paper and enclose Date of Birth certificate, Death Certificates of his or her parents, Guardian financial background, Caste certificate, Guardian Affidavit while admission into the school, NoC from Police, Adhaar, Ration card, photos of the candidate and guardian, mobile number and other xerox copies.
The last date of submitting applications is before 5pm on August 16 and send through post and handover personally to AEO, SV Balamandiram, TTD, Bhavani Nagar, Tirupati.
For more information contact 0877-2264613 during office hours on working days.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ బాలమందిరంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి, 2022 జూలై 17: 2022-23 విద్యా సంవత్సరానికి గాను శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో అనాథ బాలబాలికలను చేర్చుకునేందుకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తుదారులు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన హిందువు అయి ఉండాలి. వయసు 5 నుండి 10 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తుదారులు తమకు సంబంధించిన వివరాలను తెల్ల కాగితంపై రాసి, విద్యార్థి జనన తేదీ ధ్రువీకరణ పత్రం, స్టడీసర్టిఫికేట్, తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాలు, సంరక్షకుల ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, ఆరోగ్య నిర్ధారణ ధ్రువీకరణ పత్రం, విద్యార్థులు చేరినప్ఫుడు వారి సంరక్షకుల అఫిడవిట్, విద్యార్థులపై ఎటువంటి పోలీస్ కేసు లేదని నిర్ధారణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్థి మరియు గార్డియన్ల ఫోటోలు, సెల్ నెం తదితర జిరాక్సు కాపీలను జత చేయాలి.
దరఖాస్తులను ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ”సహాయ కార్యనిర్వహణాధికారి, శ్రీ వేంకటేశ్వర బాలమందిరం, తి.తి.దేవస్థానములు, భవానీనగర్, తిరుపతి” అనే చిరునామాకు స్వయంగా కానీ లేదా పోస్టు ద్వారా కానీ అందజేయవచ్చు. ఇతర వివరాలకు 0877-2264613 ఫోన్ నంబరులో సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.