ANJANADRI IS ABODE OF ANJANEYA _ అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం
LEARNED PONTIFFs ADVICE DISSENTERS ON WEBINAR
Tirupati, 30 July 2021: The pontiff of Kurtalam Siddheswara Peetham Sri Sri Sri Siddheswarananda Bharati Mahaswami affirmed that the Valmiki Ramayana had clearly mentioned Anjanadri of Tirumala as the birthplace of Sri Anjaneya Swamy.
He was addressing a two day international Webinar hosted jointly by the Sri Venkateswara Higher Vedic Studies Institute of TTD and National Sanskrit University which commenced on Friday in Tirupati.
Participating in the video conference Sri Bharati Mahaswami said the Brahmanda Puranam also affirmed the fact in addition to other puranas which hail Anjanadri as the birthplace of Sri Anjaneya.
He said the Kishkinda theory lacked puranic and traditional support materials and persons who had no knowledge of puranas were unfit to talk and make comments on the holy concept.
In his presidential address the TTD EO Dr KS Jawahar Reddy said soon after he took charge at Tirumala, he received several e-mails about Anjaneya Swamy birthplace and when he posed them to pundits and learned persons they too concurred and provided puranic evidences.
He said TTD set up a pundit Parishad in December 2020 for comprehensive research on Puranas, history, and geographic and Archaeological data and affirm Anjanadri as birthplace of Hanuman.
The pundit Parishad also visited locations in Jharkhand, Gujarat, Karnataka and Maharashtra wherever locals claimed as the birthplace of Hanuman. Finally on the auspicious day of Sri Ramanavami day on April 21 this year, TTD published a booklet with all authoritative evidences gathered by the pundits Parishad. The report was kept open for public debate inviting suggestions, objections etc.
TTD also organised a discussion meeting with a few but their unparliamentarily approach and the language they used was condemnable. TTD is ready to conduct another round of debate, if necessary to remove misconceptions etc.
Speaking on the occasion Dean of Mahindra University Law college Dr Madabushi Sridhar said there was enough proof of Anjanadri as Hanuman birthplace including an Oxford university publication of 2007 – “Hanuman’s Came”. The reference to Anjanadri has been there decades ahead of the TTD study, he added.
Acharya V Muralidhar Sharma, the Chairman of TTD pundits Parishad and the Vice-Chancellor of National Sanskrit University said the webinar was being conducted to spread data on the findings of TTD Pundits Parishad which will soon be brought out in form of a book. He said without Puranas the concept of Indianism will be blank.
Jeeva director Acharya Samudrala Ranga Ramanuja Charyulu said everyone should read and digest the content of Puranas, Venkatachala Mahatyam, Venkatachala Itihasamala etc. for more information on Anjaneya birthplace.
Among others Pune Deccan College Project Director Acharya Vempati Kutumba Rao, ASI retired Director Dr K Muniratnam, Acharya Shankar Narayana, Ex-Deputy Director of Archaeology and Museum, Sri Jadhav Vijay Kumar, A Prasanna Kumar of Center for policy studies, E Singara Charyulu; History Researchers Sri Gopikrishna also spoke in the marathon webinar.
Pontiff of Sri Shakti Peetham Sri Sri Sri Ramyananda Bharati Swamini, Tirumala pontiff Sri Sri Sri Pedda Jeeyarswamy presented Anugraha Bhashanam.
Secretary of Pundits Parishad Dr Akella Vibhishana Sharma, member Acharya Rani Sadasiva Murthy were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం
– అనేక పురాణాల్లో ఈ విషయం స్పష్టంగా ఉంది
– పురాణాలు అక్కర్లేదనే వారు ఈ విషయం గురించి మాట్లాడకూడదు
అంతర్జాతీయ వెబినార్ లో పలువురు స్వామిజీలు, పండితులు
తిరుమల 30 జూలై 2021: తిరుమల లోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలమని వాల్మీకి రామాయణం లో స్పష్టంగా ఉందని శ్రీ కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, వివాదం అవసరమే లేదని చెప్పారు.
టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై శుక్రవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో రెండురోజుల అంతర్జాతీయ వెబినార్ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో భారతీ మహాస్వామి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలవబడుతోందని చెప్పారు.బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు. దీంతో పాటు అనేక పురాణాల్లో అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని పేర్కొన్నట్లు స్వామి వివరించారు. కిష్కింధకు శాస్త్ర, పురాణ ప్రమాణాలు లేవని స్వామి చెప్పారు. సంస్కృతం, పురాణం, శాస్త్రాలు తెలియని వారికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అర్హత ఉండదని అన్నారు.
టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. తాను ఈవో గా బాధ్యతలు తీసుకున్న రెండు నెలలకే అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని, ఈ విషయం గురించి ఆలోచించాలని పలువురు మెయిల్స్ ద్వారా సూచనలు చేశారని చెప్పారు. దీనిపై తాను పలువురు ప్రముఖ పండితులతో మాట్లాడితే ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వారు వివరించారన్నారు. వీటిపై నమ్మకం కుదిరాకే 2020 డిసెంబరు లో పండిత పరిషత్ ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ పరిషత్ పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ చేసిందన్నారు. జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర లో ఆంజనేయుని జన్మ స్థలాలుగా అక్కడి వారు నమ్ముతున్న ప్రాంతాలను కూడా పండిత పరిషత్ పరిశీలించిందన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా పండితులు ఆధారాలతో సహా ఈ విషయం ప్రకటించడంతో పాటు బుక్ లెట్ కూడా విడుదల చేశామని చెప్పారు. ఈ అంశాన్ని సశేషంగానే ఉంచి, ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఒకరిద్దరు అభ్యంతరాలు తెలపడానికి వస్తే చర్చ పెట్టామని, వారు మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు చాలా అభ్యంతర కరంగా ఉండటంతో వారితో ఇక మాట్లాడలేదన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.
మహీంద్రా విశ్వవిద్యాలయం న్యాయ కళా శాల డీన్ శ్రీ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, రామాయణాన్ని కూడా అనుమానించే యుగంలో మనం ఉన్నామన్నారు. రామాయణం జరిగిందనడానికి ధనుష్కోటి లోని రామసేతు వంతెనలాంటి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. తిరుమల అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని టీటీడీ తీసుకున్న పురాణ ఆధారాలు చాలా బాగాఉన్నాయన్నారు. 2007లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి ముద్రించిన హనుమాన్స్ కేం అనే పుస్తకంలో కూడా అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని రాసారని చెప్పారు. టీటీడీ కంటే కొన్ని దశాబ్దాల ముందే చాలామంది ఈ విషయం రాశారని ఆయన తెలిపారు.
జాతీయ సంసృత విశ్వవిద్యాలయం ఉప కులపతి , టీటీడీ పండిత పరిషత్ అధ్యక్షులు ఆచార్య వి.మురళీధర్ శర్మ మాట్లాడుతూ, అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిర్ధారించడానికి పండిత పరిషత్ పరిశోధన ప్రపంచానికి తెలియాలనే వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. పురాణాలు లేక పోతే భారతీయతే లేదన్నారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలు సేకరించి సమగ్ర పుస్తకం ముద్రిస్తామని అన్నారు.
జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు మాట్లాడుతూ, అంజనాద్రిలో ఆంజనేయుడు జన్మించారని అనేక పురాణాల్లో ఉందన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వెంకటాచల మహాత్యం, వెంకటాచలం ఇతిహాసమాల, తిరుమల సమయాచారముల పుస్తకాలు ప్రతిఒక్కరు చదివితీరాలని అన్నారు.
పూణె దక్కన్ కాలేజి ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య వెంపటి కుటుంబరావు శాస్త్రి, పురాణాలు ప్రామాణికం కాదంటే భారతీయతను నరుక్కున్నట్లే నని చెప్పారు. పురాణాలు ప్రామాణికం కాదనే వారి వాదనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
వెబినార్ లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె. మునిరత్నం, ఆచార్య శంకర నారాయణ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ జాదవ్ విజయ కుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ శ్రీ ఎ. ప్రసన్న కుమార్, విశ్రాంత సంస్కృతోపన్యాసాకులు శ్రీ.ఇ. సింగరాచార్యులు, చారిత్రక పరిశోధకులు శ్రీ గోపికృష్ణ వివిధ అంశాలపై మాట్లాడి అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిరూపించే ఆధారాలను తెలియజేశారు. శ్రీ శక్తి పీఠాధీశ్వరి శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామిని, తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జియ్యంగారు అనుగ్రహ భాషణం చేశారు. పండిత పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ, పండిత పరిషత్ సభ్యులు ఆచార్య రాణి సదాశివమూర్తి పాల్గొన్నారు
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది