ANJANADRI TIRUMALA – ANJANEYA’S BIRTH PLACE _ అంజనాద్రి హనుమత్ జన్మస్థలం : మాతృశ్రీ రమ్యానంద భారతి

TIRUMALA, 02 JUNE 2024: Anjanadri in Tirumala is the birth place of Anjaneya Swamy, advocated HH Mata Ramyananda Bharati of Shakti Peetham of Rayalacheruvu on Sunday.

During the Hanuman Jayanti celebrations at the Nada Neerajana platform in Tirumala, she delivered a religious discourse on Balanjaneya Jananam.

Dr Vibhishana Sharma, Special Officer of SVIHVS was also present.

At Akasaganga, Japali devotional cultural programmes allured the pilgrims.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అంజనాద్రి హనుమత్ జన్మస్థలం : మాతృశ్రీ రమ్యానంద భారతి

ఆక‌ట్టుకున్న భ‌క్తి సంగీత కార్యక్రమాలు

తిరుమ‌ల‌, 2024 జూన్ 02: హనుమంతుడు అంజనాద్రి ఆకాశగంగలో జన్మించినట్లు రాయల్ చెరువు శక్తి పీఠం మాతృశ్రీ రమ్యానంద భారతి పేర్కొన్నారు.

హనుమద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తిరుమ‌ల‌లోని నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

ఈ సందర్భంగా మాతృశ్రీ రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేస్తూ, అంజ‌నాదేవికి వాయుదేవుని వలన తాను జన్మించినట్లు హనుమంతుడు సీతాదేవికి తెలిపార‌న్నారు. మతంగ మహర్షి చెప్పినవిధంగా అంజనాదేవి వేంకటాచలానికి విచ్చేయడం, అక్కడ తపస్సు చేసుకోవడం, ఆంజనేయస్వామికి జన్మనివ్వడం, తదనుగుణంగా ఆ కొండకు ‘అంజనాద్రి’ అని పేరు రావడం, బాలాంజనేయస్వామి సూర్యదేవుని పట్టుకోవడానికి వేంకటాద్రి నుండి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో భాగంగా తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మరల చూడడం, వానరవీరులు వైకుంఠ గుహలో ప్రవేశించడం- ఇలా అనేక విషయాలు వేంకటాచల మాహాత్మ్యం వల్ల తెలుస్తున్నాయని వివరించారు.

అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువ శ్రీవారి ప్రసాదాలతో సత్కరించారు.

ఆకాశగంగలో…..

ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద శ‌నివారం ఉదయం 10 నుండి 11.30 గంటల వ‌ర‌కు జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం అధ్యాప‌కులు ఆచార్య రాఘ‌వాచార్యులు హ‌నుమంతుని జ‌న్మ విశేషాలు తెలిపారు.

జపాలి క్షేత్రంలో….

జాపాలి క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ఉద‌యం 8 నుంచి 10 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి రేవతి బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ రవి సుబ్రహ్మణ్యం గాత్ర సంగీతం నిర్వహించారు.

అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ప్ర‌స‌న్న ల‌క్ష్మీ బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సరస్వతీ ప్రసాద్ హ‌రిక‌థ గానం చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.