ANJANEYA A MENTOR TO HUMANITY _ హనుమంతుని వ్యక్తిత్వం మానమాళికి మార్గదర్శనం : ఆచార్య ఎమ్.జి.నందన్ భట్
Tirumala, 06 June 2021: The versatile personality of Hanuman both as a mentor and guide to devotees to tread the right path of piousness to achieve goals in life was heralded by Acharya Sri MG Nandan Bhat of National Sanskrit University on Sunday.
Presenting a conceptual lecture on “Personality of Hanuman” at the Nada Neeranjanam platform as part of Hanuman Jayanti celebrations he said since childhood Hanuman was popular for his bravery and fearlessness.
He said Puranas say that Anjaneya was tutored in music, statecrafts and war strategy by Surya Bhagavan and other saints. But he never pushed for name, fame or power and even refused to accompany Sri Rama to Vaikunta saying that only Ramanama Japam is His Vaikunta.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హనుమంతుని వ్యక్తిత్వం మానమాళికి మార్గదర్శనం : ఆచార్య ఎమ్.జి.నందన్ భట్
తిరుమల, 2021 జూన్ 06: హనుమంతుని వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనదని, సామాన్య ప్రజలకు ఆయన వ్యక్తిత్వం మార్గదర్శకమని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు ఎమ్.జి.నందన్ భట్ ఉద్ఘాటించారు. తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నాదనీరాజనం వేదికపై ” హనుమంతుని వ్యక్తిత్వం ” అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఉపన్యసిస్తూ ఆంజనేయస్వామివారు బాల్యం నుండి సాహసం అంటే ఇష్ట పడేవారని, భయమనేది ఆయనకు తెలియదన్నారు. రావణుడి లంకా నగరంలో ఒంటరిగా ప్రవేశించి రాక్షసులను బయపెట్టినట్లు చెప్పారు. హనుమంతులవారికి బాల్యం నుండే ఇతరులను అర్థం చేసుకునే స్వభావం ఉండేదని అందువలన ఆయనను అందరు ఇష్ట పడేవారని తెలిపారు. ఆయన సూర్యుని వద్ద, ఋషుల వద్ద అపారంగా విద్యా జ్ఞానాన్ని సంపాదించారన్నారు. ఆంజనేయస్వామివారు సంగీతం, రాజనీతిలో నైపుణ్యం కలిగినట్లు పురాణాలలోని ఘట్టల ద్వారా తెలుస్తోందన్నారు.
వాలి, సుగ్రీవుల కంటే ఆంజనేయస్వామివారు బలవంతుడని, ఆయనకు ఉన్న శక్తి సామర్ధ్యాలతో వానర జాతికి రాజు కాగలిగిన కూడా వారికి మంత్రిగానే వ్యవహరించారన్నారు. అదేవిధంగా రాములవారు వైకుంఠానికి తనతో పాటు రావాలని పిలిచినా వెళ్లలేదని, రామ నామం జపిస్తే చాలు వైకుంఠానికి సమానమని శ్రీరాములవారికే తెలిపిన భక్తగ్రగణ్యుడన్నారు. దీనివలన ఆంజనేయస్వామివారు అధికారం, హోదా, పేరు కోసం ఎప్పుడు తాపత్రయం చెందలేదని మనకు ఆయన వ్యక్తిత్వం తెలుపుతుందన్నారు.
వ్యక్తి త్వం అంటే శరీర దారుఢ్యం, బుద్ధి కుశలత, ఆధ్యాత్మికత అని, వీటిలో ఏ ఒక్కటి లేకున్న వ్యక్తిత్వానికి విలువ లేదన్నారు. ఈ మూడు కలిసిన వ్యక్తిత్వం ఆంజనేయస్వామిదని పురాణ ఘట్టాలతో వివరించారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.