ANKURARPANA AT APPALAYAGUNTA TEMPLE ON JULY 24 _ జూలై 24న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ
TIRUPATI, 23 JULY 2021: The Ankurarpana for the annual Pushpayagam at Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta will be held on July 24 between 6:30pm to 8:30pm.
The annual Pushpayagam will be held in the temple on July 25. Due to Covid norms this ritual will take place in Ekantam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 24న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ
తిరుపతి, 2021 జూలై 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 25వ తేదీన పుష్పయాగం జరగనుంది. ఇందుకోసం జూలై 24 శనివారం అంకురార్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.
జూలై 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.
ఈ ఆలయంలో జూన్ 19 నుండి 27వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.
టి.టి.డి. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.