ANKURARPANA FOR PUSHPA YAGAM HELD _ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

The Ankurarpana for the annual Pushpayagam was held in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta on Saturday evening.

Temple DyEO Smt Kasturi Bai and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2021 జూలై 24: అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో జూలై 25వ తేదీ ఆదివారం పుష్పయాగానికి శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ నిర్వహించారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు ఆచార్య ఋత్విక్‌వరణము జ‌రిగింది. సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినిపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు.

జూలై 25న ఉదయం 10.30 నుండి 11.30 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌ ఉత్స‌వ‌ర్ల‌కు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేస్తారు.

ఆల‌యంలో జూన్ 19 నుండి 27వ తేదీ వరకు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంద‌ని అర్చ‌కులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో , టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.