ANKURARPANA HELD _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

TIRUPATI, 29 MARCH 2022: The Ankurarpana for the annual Brahmotsavam of Sri Kodanda Rama Swamy temple at Tirupati was held on Tuesday evening.

Dhwajarohanam ceremony will take place in the auspicious Vrishabha Lagnam between 9:15am and 9:45am on Wednesday.

Temple Spl Gr DyEO Smt Parvati and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2022 మార్చి 29: మార్చి 30 నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు జరుగనున్న తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం, తోమాల సేవ, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వేదప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 7.15 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం ఘనంగా జరిగింది. రాత్రి 7.15 నుండి 8.30 గంటల వరకు మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి పార్వ‌తి, ఏఈవో దుర్గ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మార్చి 30న ధ్వజారోహణం :

బుధవారం ఉదయం 9.15 నుండి 9.45 గంటల మధ్య వృష‌భ‌లగ్నంలో ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.