ANKURARPANA HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
TIRUPATI, 14 MAY 2022: The Ankurarpana for annual Vasanthotsavams held at Tiruchanoor temple on Saturday evening.
The three-day annual spring festival will be observed from May 15 till May 17.
Every day there will be Snapana Tirumanjanam to Sri Padmavathi Ammavaru.
In the Beejavapanam ritual, JEO (H & E) Smt Sada Bhargavi, DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, Archaka Sri Babu Swamy, Superintendent Smt Srivani, temple Inspector Sri Damodaram and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2022 మే 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 15 నుండి 17వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరుగనున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.
ఈ ఉత్సవాల్లో భాగంగా మే 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆలయంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపడతారు. అలాగే రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ ఉత్సవాల కారణంగా మే 15 నుండి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 16న అష్టదళపాదపద్మారాధన ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దామోదరం పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.