ANKURARPANA HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
TIRUPATI, 29 NOVEMBER 2021: Ankurarpanam for the annual Kartika brahmotsavams at Tiruchanoor was observed on Monday evening.
The Ritwiks performed vaidika procedures as per the norms of Pancharatra Agama between 7pm and 8:30pm.
JEO Sri Veerabrahmam, Temple DyEO Smt Kasturi Bai and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2021 నవంబరు 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 30 నుండి డిసెంబరు 8వ తేదీ వరకు ఏకాంతంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.