ANKURARPANA IN APPALAYAGUNTA TEMPLE ON JUNE 18 _ జూన్ 18న‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

Tirupati, 17 Jun. 21: The Ankurarpana for annual Brahmotsavams in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta will be observed on June 18.

As the annual Brahmotsavams are set to commence from June 19 onwards, as a ritual of prelude, Ankurarpana will be performed on Friday evening between 6:30pm and 8pm on June 18 in Ekantam in view of Covid guidelines.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 18న‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2021 జూన్ 17: అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు జూన్ 18న అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో జూన్ 19 నుండి 27వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.

జూన్ 19న ధ్వజారోహణం :

జూన్ 19వ తేదీ శ‌నివారం ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మ‌ధ్య‌ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.

జూన్ 22న సాయంత్రం 4 నుండి 6.30 గంటల‌ వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుండి 10 గంటల‌ వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్ర‌స‌న్న‌ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు స్నపన తిరుమంజనం జ‌రుగ‌నుంది. అనంత‌రం ఉద‌యం 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వ‌హించ‌నున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.