ANKURARPANA PERFORMED TO SHODASADINA SUNDARAKANDA DEEKSHA AT DHARMAGIRI _ తిరుమ‌ల‌లో  ”షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష”  కు శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ

Tirumala, 28 Sep. 20: As the 16-day Shodasadina Sundarakanda Deeksha is commencing from September 29 onwards at Tirumala, the Ankurarpana for the event is performed at Veda Vignana Peetham Prayer Hall on Monday evening between 7pm and 8pm. 

It may be mentioned here that, TTD has mulled this yet another unique spiritual programme to ward off the ill effects of Corona and bring back prosperity in the lives of people across the globe invoking blessings of Lord Sri Rama from the abode of Lord of Kaliyuga, Sri Venkateswara Swamy by reciting 2821 Sundarakanda Shlokas in 68 Sargas by 16 expert Sundarakanda Upasakas for 16 days at Vasantha Mandapam. 

As part of Ankurarpana, Ganapathi Puja, Punyahavahanam, Kankanadharana and Ritvik Varanam were organised amidst chanting of Veda Mantras. Veda Viganana Peetham Principal Sri KSS Avadhani carried out the entire event and did Sankalpam with all at the beginning of the event. Later the Acharya – Brahma for the event Sri Goli Venkata Subrahmanya Sharma and Sri Senagala Vijaya Mohana Sharma respectively performed the ritual formalities.

 

From September 29 till October 16, a team of 16 Sundarakanda Upasakas will recite Sundarakanda Pathanam at Vasantha Mandapam while another team of 16 will perform Japa Homam at Dharmagiri during this period. Later the Sundarakanda Upasakas were presented with Ritwik Varana Pooja utensils.

TTD Additional EO Sri AV Dharma Reddy, Agama Advisor Sri Mohana Rangacharyulu, Temple DyEO Sri Harindranath, Health Officer Dr RR Reddy, Temple Peishkar Sri Jaganmohanachary were also present. 

The Shodasadina Sundarakanda Deeksha Parayanam will be live telecast every day in SVBC between 9am and 10am. Every day the number of slokas related to each Sarga of the Beejaksharam present in the Shloka “Raghavaha Vijayam Tadyat Mama Seetapatihi Prabhuhu”. Depending on the number of shlokas there will be slight changes in timings of live telecast on a few days which will be informed prior to devotees through SVBC. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమ‌ల‌లో  ”షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష”  కు శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ

తిరుమల, 2020 సెప్టెంబరు 28: లోక క‌ల్యాణార్థం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో సెప్టెంబ‌రు 29వ తేదీ నుండి టిటిడి నిర్వ‌హించ‌నున్న షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష కార్య‌క్ర‌మానికి సోమ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం ప్రార్థ‌న మందిరంలో శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌‌నం, రుత్విక్‌వ‌ర‌ణం నిర్వ‌హించారు.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో 32 మంది సుందరకాండ ఉపాసకులు పాల్గొంటున్నారు. ఇందులో 16 మంది ఉపాసకులు వ‌సంత మండ‌పంలో సెప్టెంబ‌రు 29 నుండి అక్టోబ‌రు 14వ తేదీ వ‌ర‌కు సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గల‌ను పారాయ‌ణం చేయ‌నున్నారు.
మరో 16 మంది  ఉపాసకులు ధ‌‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠంలో జపం, హోమం నిర్వ‌హిస్తారు.

ఇందులో పాల్గొనే ఉపాసకులు ఆహార – ఆచార – ఆహార్య వ్యావహారాలలో కఠోర దీక్ష పాటిస్తారు. ఒక పూట ఆహారం స్వీక‌రించి, రెండ‌వ పూట పాలు, పండ్లు స్వీక‌రిస్తూ, బ్ర‌హ్మ‌చ‌ర్యం పాటిస్తూ, నేల‌పై ప‌డుకుంటారు. ఆరోగ్య నియ‌మాలు పాటిస్తూ నిత్యం భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణ చేస్తుంటారు.  

కాగా సోమవారం ధర్మగిరి లో జరిగిన అంకురార్పణం కార్యక్రమంలో వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో
ముందుగా గణపతి పూజ నిర్వహించి, అందరి దగ్గర సంకల్పం చేయించారు. అనంతరం పుణ్యాహవచనం, కంకణధారణ, ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కాగా ఆచార్య – బ్రహ్మలుగా శ్రీ గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ శనగల విజయ మోహన శర్మ వ్యవహరించారు.

 ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ‌ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆగమ సలహాదారు శ్రీ మోహన రంగాచార్యులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఆర్యోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి, పేష్కార్ శ్రీ జగన్మోహనాచారి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.