ANKURARPANA PERFORMED TO SRI KRT PAVITROTSAVAMS_ శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

Tirupati, 18 July 2017:The three day annual pavitrotsavam which is scheduled to commence from July 19 in Sri Kodandarama Swamy temple at Tirupati, is geared up to host the same, with Ankurarpanam.

As a prelude to this annual fete, the seed sowing festival was performed in the temple in a religious manner.

Medini Puja, Mrisangrahanam, Beejavapanam were performed by the ritwiks with utmost devotion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

తిరుపతి, 2017 జూలై 18: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై 19వ తేదీ నుండి మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించి ఆచార్య ఋత్విక్‌ అర్చకులను ఆలయమర్యాదలతో అర్చకుల తిరుమాళిగలో వదిలిపెట్టారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు మేధినిపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణం జరుగనున్నాయి.

పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గ హస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.