PILGRIMS HAD COMFORTABLE DARSHAN IN THE NEW DIVYA DARSHAN TOKEN SYSTEM ON DAY ONE-JEO_ త్వరితగతిన శ్రీవారి దర్శనంపై కాలినడక భక్తుల హర్షం : టిటిడి తిరుమల జేఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు

PLANNED TIME SLOT DARSHAN TO NEARLY 40THOUSAND PILGRIMS EVERY DAY

Tirumala, 18 July 2017: Describing the new Divya Darshan token system which was commenced by TTD on July 17, to avoid long waiting hours by the pedestrian pilgrims as a huge hit, Tirumala JEO Sri KS Sreenivasa Raju informed that over 19663 pilgrims had darshan on the first day on Monday.

After review meeting with senior officers of TTD at Tirumala in Annamaiah Bhavan on Tuesday, the JEO later talking to media persons, said the Time Slot system introduced for foot parth route pilgrims on the lines of Rs.300 special entry darshan, amassed positive response from the pilgrims who trekked all the way to Tirumala along Alipiri and Srivari Mettu routes. “As we assured, we have issued 14thousand tokens in Alipiri and 6000 tokens in Srivari Mettu routes on July 17 and 19663 pilgrims had darshan of Lord Venkateswara within two hours of reporting on Day one”, he affirmed.

Adding further the JEO said, “Except for some important days where unprecedented pilgrim crowd is anticipated including annual brahmotsavams, Vaikuntha Ekadasi, Dwadasi, peak summer days etc. during rest of the days 20 thousand Divya Darshan tokens will be issued every day including week ends. Today we are providing darshan with time slots to nearly 40thousand pilgrims which includes Rs.300 and Footpath every day. We are now contemplating to ensure time slot darshan to Sarva Darshan pilgrims also”, he added.

Following the directives of TTD EO Sri Anil Kumar Singhal, the quota for aged and physically challenged pilgrims has been increased on specified dates on July 18 and 25 from the existing 1500 in two slots to 4000 in three slots during these two days. Similarly on July 19 and 26, parents with infants below five years of age will be allowed for darshan through supatham entry point from 9am to 1:30pm”, he maintained.

Elaborating on the new room allotment system at CRO, the JEO said, pilgrims are expressing immense pleasure over the new procedure of room allotment through token system. “On first day on July 12 about 1809 pilgrims were allotted rooms through SMS system, July 13 about 2000, July 14 over 2300 and nearly 2500 July 15. On Sunday on July 16, nearly 2800 rooms were allotted to the pilgrims without any inconvenience while on Monday around 2600 rooms were allotted to pilgrims. The aim of management is to provide the best possible and transparent services to scores of pilgrims who are thronging the temple town of Tirumala for the darshan of Lord Venkateswara”, he asserted.

Earlier in the review meeting, the JEO discussed with the concerned HoDs over various development activities which are under progress.

Additional FACAO Sri Balaji, DyEOs Sri Kodanda Rama Rao, Sri Venugopal, Sri Sreedhar, SE II Sri Ramachandra Reddy, GM Sri Sesha Reddy, other reception and vigilance officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
త్వరితగతిన శ్రీవారి దర్శనంపై కాలినడక భక్తుల హర్షం : టిటిడి తిరుమల జేఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2017 జూలై 18: కాలినడకన తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు నడకమార్గాలలో టోకెన్లు మంజూరు చేసి, స్లాట్‌ విధానం ద్వారా త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తుండడంపై కాలినడక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తిరుమల జేఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్యభవనంలో మంగళవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడుతూ సోమవారం రోజు 19,663 మంది కాలినడక భక్తులు దివ్యదర్శనం స్లాట్‌ విధానం ద్వారా రెండున్నర గంటల్లోపు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, పెరటాశి నెల ఇతర రద్దీ రోజులలో మినహా అన్ని రోజులలో (శుక్ర, శని, ఆదివారాలతో కలుపుకుని) కాలినడక భక్తులకు టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. అలిపిరి మార్గంలో 14వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు కలుపుకుని రోజుకు 20 వేల టోకెన్లను జారీ చేస్తున్నామని చెప్పారు.

రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్స్‌ల ద్వారా ఒక్క రోజుకు 40 వేల మంది భక్తులకు ప్రణాళికాబద్ధంగా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. ఒకవారానికి 1.40 లక్షల మంది భక్తులకు ప్రత్యేక ప్రవేశదర్శనం(రూ.300/-) కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో సర్వదర్శనం భక్తులకు స్లాట్‌ విధానం ద్వారా స్వామివారి దర్శనం కల్పించేందుకు సమాలోచనలు జరుపుతున్నామన్నారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు జూలై నెలలో 18, 25వ తేదిలలో వృద్ధులు, దివ్యాంగుల శ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఈ సౌకర్యాన్ని వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూలై 19, 26వ తేదిలలో 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులను సుపథం ప్రవేశం ద్వారా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామన్నారు.

తిరుమలలో గదుల బుకింగ్‌ కోసం భక్తులు ఎక్కువ సేపు క్యూలో వేచియుండకుండా టోకెన్ల మంజూరు విధానం ద్వారా మరింత పారదర్శకంగా గదులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. జూలై 12న 1800 మంది, జూలై 13న 2,000 మంది, జూలై 14న 2,300 మంది, జూలై 15న 2,500 మంది, జూలై 16న 2,800 మంది, జూలై 17న 2,600 మంది భక్తులు ఈ విధానం ద్వారా గదులు పొందినట్లు వివరించారు. ఆదివారం రోజు రద్దీ ఉన్నప్పటికీ క్యూలో ఎక్కువసేపు వేచియుండకుండా వచ్చినవారికి వచ్చినట్లు గదులు కేటాయించామన్నారు.

అంతకుముందు జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో టిటిడి ఎఫ్‌ఎ, సిఎవో శ్రీ ఓ. బాలాజీ, ఎస్‌ఈ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విజీవోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి విమలకుమారి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీకోదండరామారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.