ANKURARPANAM FOR PUSHPAYAGAM AT SRI GT_ శ్రీగోవిందరాజస్వామివారి పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

Tirupati, 20 June 2018: Ankurarpanam for Pushpayagam in Sri Govinda Raja Swamy temple was observed on Wednesday evening in the yagashala of the temple.

Pushpayagam is the annual floral ritual that is observed after annual brahmotsavams. It is considered as a sin free festival to commissions and commissions done by religious staff members or non religious staffs and even by devotees either knowingly or unknowingly during annual Brahmotsavams.

Temple officials took part in the seed sowing festival.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

తిరుపతి, 2018 జూన్‌ 20: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్‌ 21వ తేదీ గురువారం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం జూన్‌ 20వ తేదీన బుధవారం సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు.

మే 21 నుండి 29వ తేదీ వరకు వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

జూన్‌ 21వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 1.00 నుంచి 4.00 గంటల వరకు వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలతో కన్నుల పండుగగా పుష్పయాగం నిర్వహిస్తారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈయాగంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారు.

టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.