APPALAYAGUNTA GEARS UP FOR BRAHMOTSAVAMS_ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం జూన్‌ 23న ధ్వజారోహణం

Tirupati, 21 June 2018: The famous shrine of Lord Sri Prasanna Venkateswara Swamy in Appalayagunta geared fully to host the annual Brahmotsavams in a grand manner.

Ankurarpanam wi be observed on Friday evening while Dhwajarohanam on June 23 in Mithuna Lagnam between 7am and 7.30am.

Floral decorations, light illuminations were arranged with tight security, vigilance arrangements. Srivari sevakulu have been deployed to man the pilgrim crowd, provide food and water to devotees.

Scouts have also been taken to maintain queue lines and streamline pilgrim crowd during procession of Vahanams.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం జూన్‌ 23న ధ్వజారోహణం

తిరుపతి, 2018, జూన్‌ 21: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.

జూన్‌ 22న అంకురార్పణ :

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం వైభవంగా అంకురార్పణ జరుగనుంది.

సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహిస్తారు.

జూన్‌ 23న ధ్వజారోహణం :

జూన్‌ 23వ తేదీ శనివారం ధ్వజారోహణంతో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.00నుండి 7.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 7.00 నుండి 7.30 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

భక్తులకు అన్నప్రసాదాలు :

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. వాహనసేవల సమయంలో భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు అందించనున్నారు. భక్తులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.

ప్రదర్శనశాలలు సిద్ధం :

భక్తులను ఆకట్టుకునేలా పుష్ప ప్రదర్శనశాల, టిటిడి పుస్తకవిక్రయశాల, ఆయుర్వేద ప్రదర్శనశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఆకట్టుకునేలా అలంకరణలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా వినియోగించనున్నారు. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.