ANKURARPANAM -THE FESTIVAL OF PRELUDE_ SEED SOWING FETE ON SEPTEMBER 29_ సెప్టెంబరు 29న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం – బీజవాపనం
BRAHMOTSAVAM STORY 5
ANKURARPANAM -THE FESTIVAL OF PRELUDE
SEED SOWING FETE ON SEPTEMBER 29
Tirumala, 26 Sep. 19: The festival of prelude before the commencement of annual brahmotsavams, Ankurarpanam or Beejavapanam will be observed in Tirumala temple on September 29.
This is considered as one of the most important rituals of the Vaikhanasa Agama. Ankurarpanam is being done in almost all the festivals in Tirumala and it means “sowing the seed”. The essence of this ritual is to make a wish or Sankalpa to celebrate an utsavam (festival) and get the grace of the Lord.
INTERESTING AGAMIC FACTS OF ANKURARPANA
Sastras prescribe doing Ankurarpana 9days or 7 or 5 or 3 or at least a day before the main festival. In Tirumala, Ankurarpanam is performed a day before the festival.
Another important thing to note is that Ankurarpana should never be done in the day time. This dictum has its basis in astrological principles. As Chandra-the Moon, is the “Sasyakaraka” being the controller of plants, sowing a seed in the day time is not considered wise. In fact, Chandra is considered strong in the night. Also, an auspicious Lagna or muhurta should be used for this purpose as any activity that is started in an auspicious time will yield good results.
Many people find it confusing that one has to see an auspicious time for celebrating a festival for the Lord.
Agamas also mention that the sprouts that emanate from the seeds provide useful hints about how perfectly the festival was celebrated. White and well-developed ankuras, straight or yellow ankuras show prosperity.
PALIKAS FOR SOWING SPROUTS
The vessels used for sprouting seeds are known as “Palikas” either using gold or silver or copper or mud for performing Ankurarpanam which is otherwise called Beejavapanam. “Samurtarchana Adhikarana” penned by Sage Atri.
Later in the evening Vishvaksena Ardhana and Senadhipathi Utsavam will be held before seeds are sowed in different pots. After this in Yagashala the remaining ritual takes place.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేకం
సెప్టెంబరు 29న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం – బీజవాపనం
తిరుమల, 2019 సెప్టెంబరు 26: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సెప్టెంబరు 29వ తేదీ ఆదివారం రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే.
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.
అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.
అంకురార్పణం – విశిష్టత :
శాస్త్రాల ప్రకారం ఏదైనా ఉత్సవానికి 9, 7, 5, 3 రోజులు లేదా ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. ఖగోళశాస్త్రంలోని సిద్ధాంతాల ప్రకారమే ఇలా చేస్తారు. మొక్కలకు అధిదేవత చంద్రుడు కాబట్టి రాత్రి సమయంలోనే విత్తనం నాటుతారు.
ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. పాలికలు అనే పాత్రలను విత్తనాలను నాటేందుకు వినియోగిస్తారు. బ్రహ్మపీఠాన్ని బియ్యం తదితరాలతో అలంకరించిన తరువాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శాంత, ఇంద్ర, ఇసాన మరియు జయ తదితర దేవతలను ఆహ్వానించి అగ్ని ద్వారా పూజలు చేస్తారు. ఆ తరువాత సోమం రాజ మంత్రాన్ని, విష్ణుసూక్తాన్ని పారాయణం చేస్తారు. విత్తనాలు నాటే సమయంలో వరుణ మంత్రాన్ని పఠించి నీళ్లు చల్లుతారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.