PAVITRA SAMARPANA HELD_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ
Appalayagunta, 26 Sep. 19: As a part of the ongoing annual Pavitrotsavams in Appalayagunta, Pavitra Samarpana was held on Thursday.
Later in the evening the deities of Sri Prasanna Venkateswara Swamy, Sridevi and Bhudevi were taken on a celestial ride.
Temple DyEO Smt Jhansirani, AEO Sri Subramanyam, Suptd Sri Gopalakrishna Reddy, Temple Inspector Sri Seenu were also present.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2019 సెప్టెంబరు 26: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా చేపట్టారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత పవిత్ర సమర్పణ నిర్వహించారు.
సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.