ANKURARPANAM FOR BTU IN DEVUNI KADAPA TEMPLE HELD _ శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 25 Jan. 20: The Ankurarpanam was performed on Saturday evening for the annual Brahmotsavams of Sri Lakshmi Venkateswara Swamy temple at Devuni Kadapa in YSR Kadapa district.

In view of Sravana nakshatram, the birth star of Lord Venkateswara, TTD has organised Srinivasa Kalyanam in the afternoon.

According to the schedule of events Dwajarohanam is on January 26 and Chandraprabha vahanam in the evening 

TTD has made all arrangements for the annual Brahmotsavams including colourful flower and electrical decorations and cultural programs by teams in front of vahanams both in morning and evening.

As a part of the event the artists of HDPP and Annamacharya Project will daily present harikatha, Bhakti sangeet and other devotional programs.

Temple DyEO Sri C Govindarajan, superintendent Sri Nathamuni, Temple inspector Sri Easwar Reddy, archakas and other officials participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2020 జనవరి 25: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న వై.ఎస్‌.ఆర్‌.కడప జిల్లాలోని దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం శ‌నివారం సాయంత్రం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సందర్భంగా శ‌నివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన, తోమల నిర్వహించారు. అనంత‌రం శ్రీ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 10.00 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు స్వామివారి క‌ల్యాణం వైభ‌వంగా నిర్వ‌హించారు. 
  
          కాగా సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం  జరుగనుంది.

జనవరి 26న ధ్వజారోహణం :

జనవరి 26వ తేదీ ఆదివారం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు మీనల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 8.00 నుంచి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగనున్నాయి.  బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ చ‌క్ర‌వ‌ర్తి గోవింద‌రాజ‌న్‌, సూప‌రిండెంట్ శ్రీ నాద‌ముని, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వ‌ర్‌రెడ్డి, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.