ANKURARPANAM FOR SRI KAPILESWARA SWAMY TEMPLE PERFORMED_ ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 24 Feb. 19: As a part of the annual Brahmotsavams at Sri Kapileswara Swamy Temple in Tirupati which is scheduled to commence from Monday onwards, the sacred ritual of prelude, Ankurarpanam was performed on Sunday evening.

Earlier Sri Vinayaka Swamy was taken on a celestial procession on Moushika vahanam in Veedhi utsavam. The colourful event of Dwajarohanam will be held on Monday morning followed by Pallaki utsavam and Hamsa vahanam in the evening.

The TTD has made colourful electrical and floral decorations for the mega religious event. Nearly 3 tons of Indian and imported flowers have been used for decorations during the ongoing annual Brahmotsavams.

DyEO Sri K Subramanyam, AEO Sri Nagaraju, Superintendent Sri Raj Kumar, temple Inspector Sri Reddy Sekhar and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2019 ఫిబ్రవరి 24: తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25 నుండి మార్చి6వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీవినాయకస్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్ర 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.

ఫిబ్రవరి 25న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 25వ తేదీ సోమ‌వారం ఉదయం 7.19 గంటలకు కుంభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

ఆకట్టుకునేలా అలంకరణలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి దాదాపు 3 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ నాగ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీరాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.