PEDDA SESHA VAHANAM TAKES THE PRIDE AS FIRST CARRIER_ పెద్దశేష వాహనంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు

Srinivasa Mangapuram, 24 Feb. 19: The divine serpent carrier Pedda Sesha Vahanam took the pride of being the first vehicle during the ongoing Navahnika Brahmotsavams which commenced on Sunday in Srinivasa Mangapuram.

The seven hooded serpent vehicle is often believed to be that of serpent king the 1000 hooded Adi sesha who forms the bed, umbrella, carrier of Sri Maha Vishnu in the milky ocean.

Sri Kalyana Venkateswara Swamy flanked by Sri Devi and Bhudevi on either sides was seated charmingly on the Pedda Sesha Vahanam in the pleasant evening on Sunday to bless the devotees who thronged to witness the celestial procession.

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Muni Chengalrayulu, Temple Inspector Sri Anil and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పెద్దశేష వాహనంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు

తిరుపతి, 2019 ఫిబ్రవరి 24: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఆదివారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాధుడి అలంకారంలో భక్తులను క‌టాక్షిచారు.

బ్రహ్మూెత్సవాల్లో శ్రీవారు స్వయంగా ఊరేగింపులో పాల్గొనే మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి రోజుకు 3 వేల చొప్పున లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ ల‌క్ష్మ‌య్య‌, టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీఎన్‌ఎకె.సుందరవదనాచార్యులు, ప్రధాన కంకణబట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సురింటెండెంటు శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.