ANKURARPANAM HELD _ శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

TIRUPATI, 05 APRIL 2021: The Ankurarpanam for annual Pushpayagam was held in Srinivasa Mangapuram temple on Monday evening. 

On April 6 Pushpayagam will be observed between 2-30pm and 3-30pm. 

TTD has cancelled Kalyanotsavam on Tuesday following Pushpayagam. 

DyEO Smt Shanti, AEO Dhananjeyulu were also present. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI



శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

తిరుప‌తి, 2021 ఏప్రిల్ 05: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 6న జరుగనున్న పుష్పయాగానికి సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం చేపట్టారు.

ఏప్రిల్ 6న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6న నిత్య కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.