BABU JAGJEEVAN RAM JAYANTHI OBSERVED _ డా|| బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి : టిటిడి జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి

Tirupati, 05 April 2021: The 114th Birth Anniversary of Babu Jagjivan Ram was observed with utmost spirit and fervour by TTD in Mahati Auditorium on Monday. 

Speaking on the occasion, TTD JEO Smt Sada Bhargavi said, every employee should try to imbibe the true spirit of equality path shown by great leaders like Sri Jagjivanram, Pule,  Mahatma Gandhi, Dr BR Ambedkar and many others who brought revolutionary reforms in the society not with words but with their deeds.

The speakers Prof Ashajyothi, from Bangalore University and Dr T Tulasi, Associate Professor from Mahila University spoke about the important episodes in the life history of Sri Jagajeevanram starting from his birth, the various ups and downs in his life, achievements and development activities taken up by him during his tenure as Labour, Agriculture, Defence and many more portfolios and also as fourth Deputy PM of India, the great efforts he has taken for the upliftment of downtrodden. 

Later TTD CAO Sri Seshasailendra also spoke about the Vedic Dharma which preached equality of humanity. The entire programme was anchored by Dr Bheemanna of SV Arts College.

The folklore by Sri Ramana team stood as a special attraction of the event. Laters prizes were given away to winners of Essay and Quiz competitions held to employees on the occasion of Babuji Jayanthi.

PRO Dr T Ravi, EE Sri Manoharam, Spl.Gr.DyEO.Smt VaraLakshmi, DyEOs Sri.Subramanyam, Smt.Shanti, Sri Anandaraju were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డా|| బాబు జగ్జీవన్‌రామ్ అడుగుజాడ‌ల్లో న‌డ‌వాలి :టిటిడి జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2021, ఏప్రిల్‌ 05: నిమ్నకులంలో జన్మించి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని దేశానికి ఉప ప్రధానిగా ఎదిగిన డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక అంత‌రాల‌ను తొల‌గించేందుకు ఎంత‌గానో కృషి చేశార‌ని, వారి అడుగుజాడ‌ల్లో అంద‌రం న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి కోరారు. జ‌గ్జీవన్‌రామ్ 114వ జయంతి వేడుకలను తిరుపతిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో సోమ‌వారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ మాన‌వ‌సేవే మాధ‌వసేన అన్న స్ఫూర్తితో శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ అణ‌గారినవ‌ర్గాల అభ్యున్న‌తికి తోడ్పాటునందించార‌ని తెలిపారు. తోటివారి ప‌ట్ల ఎలాంటి వ్య‌త్యాసం చూప‌కుండా మ‌నిషిగా గుర్తించిన‌ప్పుడే స‌మాన‌త్వం సాధ్య‌మ‌వుతుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంద‌ని, అని కులం వ‌ల్ల‌, డ‌బ్బు వ‌ల్ల రాద‌ని చెప్పారు. స్వామివారి దృష్టిలో అన్ని వృత్తులు చేసేవాళ్లూ స‌మాన‌మేన‌ని వివ‌రించారు. స‌మాజంలో ఉన్న మాలిన్యాల‌ను తొల‌గించేందుకు ఇలాంటి మ‌హ‌నీయులు ఉద్భ‌విస్తుంటార‌ని చెప్పారు. ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న త‌రువాత మ‌న ఆలోచ‌నా విధానంలో మార్పు రావాల‌న్నారు.

ముఖ్య వ‌క్త‌ల్లో ఒక‌రైన బెంగ‌ళూరులోని బెంగ‌ళూరు విశ్వ‌విద్యాల‌యం తెలుగు శాఖాధిప‌తి ఆచార్య కె.ఆశాజ్యోతి మాట్లాడుతూ 52 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌ర‌త‌మ భేదాలు లేకుండా అంద‌రికీ విశేషంగా సేవ‌లందించిన అజాత‌శ‌త్రువు శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ అన్నారు. పాఠ‌శాల వ‌య‌సులోనే రెండు కుండ‌ల విధానాన్ని వ్య‌తిరేకించార‌ని, రిజ‌ర్వేష‌న్‌లో వ‌చ్చే స్కాల‌ర్‌షిప్ కాద‌ని మెరిట్ స్కాల‌ర్‌షిప్ పొందిన మేధావి అని కొనియాడారు. కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిగా దేశంలో హ‌రిత విప్ల‌వం తీసుకొచ్చి దిగుబ‌డులు పెంచిన ఘ‌నత వారికే ద‌క్కుతుంద‌న్నారు.

మ‌రో ముఖ్య వ‌క్త తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వ‌ర్సిటీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ డా. పి.త‌వితా తుల‌సి ఉప‌న్య‌సిస్తూ అంట‌రానిత‌నం నిర్మూల‌న‌తోపాటు హిందూ ధ‌ర్మ ప‌రిరక్ష‌ణ‌కు శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ పాటుప‌డ్డార‌ని తెలిపారు. త‌ల్లి బ‌సంతీదేవి ప్రోత్సాహంతో వారి ఇంట్లో వేదాలు, భ‌గ‌వ‌ద్గీత‌, రామాయ‌ణ ప‌ఠ‌నం జ‌రిగేద‌ని, ఆయ‌న ఎంతో సాధు స్వ‌భావం క‌లిగి ఉండేవార‌ని చెప్పారు. ఆనాటి కాలంలో కొన్ని సంస్థ‌లు ద‌ళితుల‌ మ‌త‌మార్పిళ్ల‌ను ప్రోత్స‌హించ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించార‌ని తెలియ‌జేశారు. ‌
       
టిటిడి ముఖ్య అంక‌ణీయ అధికారి శ్రీ శేష‌శైలేంద్ర మాట్లాడుతూ స‌మాజంలో అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు రావాల‌ని పాటుప‌డిన ఇలాంటి మ‌హ‌నీయులు కులాల‌కు అతీతుల‌న్నారు. బాబు జ‌గ్జీవ‌న్‌రామ్‌, జ్యోతిరావుపూలే, అంబేద్క‌ర్ లాంటి గొప్ప‌వాళ్లంద‌రూ ఏప్రిల్ మాసంలో జ‌న్మించ‌డం, వారంద‌రినీ స్మ‌రించుకోవ‌డం మ‌న అదృష్ట‌మ‌న్నారు. స‌మాజంలో అన్ని వృత్తులు చేసేవారు స‌మాన‌మేన‌న్నారు.

అంతకుముందు టిటిడి జెఈవో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా విశేష సేవ‌లందించిన ప‌లువురికి జ్ఞాపిక‌లు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. కార్య‌క్ర‌మం మొద‌ట్లో గుంటూరులోని జాషువా సాంస్కృతిక స‌మాఖ్య త‌ర‌ఫున ర‌మ‌ణ బృందం ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, శ్రీ ఆనంద‌రాజు, శ్రీ‌మ‌తి విఆర్‌.శాంతి, పిఆర్వో డా. టి.ర‌వి, ఇఇ శ్రీ మ‌నోహ‌రం ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.