ANKURARPANAM HELD FOR KISHKINDAKANDA PARAYANA DIKSHA _ షోడ‌శ‌దిన కిష్కిందకాండ పారాయణదీక్షకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

* 16 DAY PARAYANAM IN VASANTA MANDAPAM

  • HOMAS AND JAPAS AT DHARMAGIRI

Tirumala,29 June 2023:TTD organised the Ankuraarpanam fete on Thursday night for the 16-day-long Shodasha Dina Kishkindakanda Parayana Diksha at the Dharmagiri Veda Vijnana peetham with the rituals of Sankalpam, Vishwaksena Aradhana, Punyahavachanam, Raksha bandhana, Mrutsangrahanam and Ritwik varanam.

 

The Parayanams by exponents will be conducted at the Vasanta mandapam from Friday morning daily for two hours for next 16 days.

 

Dharmagiri Peetham Principal Sri KSS Avadhani and Pancharatra Pundit Sri Havana Ramanujacharya participated in the program.

 

On the first day the pundits will chant shloka from 1-5 chapters of Kishkindakanda.

Simultaneously the Homas and Japams as part of Diksha will be performed at the Dharmagiri Vijayan Peetham on all the days.

 

In all 32 Veda pundits, 16 each at Vasanta Mandapam and Vijnana Peetham will participate in the program which will be live telecast by SVBC for the benefit of devotees all over the world.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
షోడ‌శ‌దిన కిష్కిందకాండ పారాయణదీక్షకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
 
– వసంత మండపంలో 16 రోజుల పాటు పారాయణం
 
– ధర్మగిరిలో హోమాలు, జపాలు
 
తిరుమల, 29 జూన్ 2023: టీటీడీ చేపట్టిన షోడ‌శ‌దిన కిష్కిందకాండ పారాయణదీక్షకు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా సంకల్పం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, రుత్విక్ వరణం, అంకురార్పణ చేపట్టారు. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని, పాంచరాత్ర పండితులు శ్రీ హవనం రామానుజాచార్యులు పాల్గొన్నారు.
 
తిరుమ‌ల‌ వ‌సంత మండ‌పంలో శుక్రవారం ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు షోడ‌శ‌దిన కిష్కిందకాండ పారాయణ దీక్ష కార్య‌క్ర‌మం ప్రారంభమవుతుంది. 16 రోజుల‌ పాటు నిష్ణాతులైన వేద పండితుల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు.
 
“మారుతస్య సమోవేగే గరుడస్య సమోజవే” అనే శ్లోకం ప్రకారం కిష్కిందకాండలోని సర్గలను పండితులు పారాయణం చేస్తారు. మొదటి రోజు 1 నుండి 5 వరకు గల సర్గలను పండితులు పారాయణం చేస్తారు.
 
అదేవిధంగా, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని ఆధ్వర్యంలో ధర్మగిరిలో ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పండితులు హోమాలు, జపాలు నిర్వహిస్తారు.
 
వసంత మండపంలో 16 మంది, ధర్మగిరిలో 16 మంది కలిపి మొత్తం 32 మంది పండితులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం వసంత మండపంలో పారాయణ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.