ANKURARPANAM OF KEELAPATLA SRI KONETI RAYADU TEMPLE_ శాస్త్రోక్తంగా కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Tirupati, 25 Aug 19: The holy ritual of Ankurarpanam was performed at the TTD local temple of Sri Koneti rayadu at Keelapatla on Sunday evening as part of Pavitrotsavam from August 26-28.

As part of the event besides rituals, the utsava idols will be given snapana thirumanjanam every day and paraded on Mada streets in Thiruvedi utsavam.

The artists of TTDs cultural wings of HDPP and Annamacharya Project has geared up Bhakti sangeet, harikatha, bhajans, etc on all three days.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2019 ఆగస్టు 25: టిటిడి అనుబంధ ఆలయమైన కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో ఆగస్టు 26 నుండి 28వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 26వ తేదీ రక్షబంధనం, పవిత్రప్రతిష్ఠ, శేయాధివాసం, ఆగస్టు 27న ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్ర హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఆగస్టు 28న ఉదయం హోమాలు, సాయంత్రం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.