DEVELOP SV MUSEUM AS SPIRITUAL FOUNTAIN OF TIRUMALA SAYS CS LV SUBRAMANYAM_ మరింత ప్రాచుర్యంలోకి తాళ్లపత్ర గ్రంథాలు- ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
Tirupati 25 Aug 2019; Andhra Pradesh Chief Secretary Sri LV Subramanyam today said that TTD would promote the S V Museum at Tirumala as a beacon to enhance the devotional and spiritual experience for devotees at Tirumala.
Speaking to reporters after a review meeting with TTD senior officials- EO Sri Anil Kumar Singhal, JEO Sri P Basant Kumar at Padmavathi rest house Tirupati
He said the TTD had decided to develop the priceless documents in custody of the Museum like Copper plates, palm leaf documents, etc to bring out the rich traditions and practices of the Srivari temple embedded in them.
SV MUSEUM AS A GUIDE TO DEVOTEES
He said TTD would develop the Sri Venkateswara Museum to provide devotees a taste and glimpse of the spiritual elixir of the glory of Sri Venkateswara devotees could visit the Museum ahead of Srivari Darshan. He said devotees have to spend Six to 20 hours for darshan at Tirumala and hence the Museum could give them a bird’s view of places to see like theerthams and temples on Tirumala.
He said in coordination with the SV Vedic University TTD planned to further explore the heritage documents in the Museum in a scientific manner to showcase the rich practices, traditions of Srivari Temple to devotees.
He said TTD has taken many steps in the past in that direction and now also many new initiatives are underway to make Tirumala as the ultimate devotional hub and enhance the spiritual experience Of devotees.
ON RTC TICKETS ISSUE
The Chief Secretary said he also discussed the issue of RTC tickets with other religious messages and action would be taken against erring
RTC officials are responsible for the lapse. He said a coordination committee of all departments would be set up soon so that such commercial advertisements should not hinder the Government policy against other religious propaganda at Tirumala.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మరింత ప్రాచుర్యంలోకి తాళ్లపత్ర గ్రంథాలు- ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, 2019 ఆగస్టు 25: తాళ్లపత్ర గ్రంథాలను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం టిటిడి అధికారులను కోరారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి వసతి సముదాయంలోని సమావేశ మందిరంలో టిటిడి అధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేదిక్ యూనివర్శిటీ సాయంతో తాళ్లపత్ర గ్రంథాలను శాస్త్రీయ కోణంలో పరిశోధన చేయడంతోపాటు, అనధికాలంలోనే పండితులతో పరిష్కారించడం, వాటిని రక్షించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలో వేచియుండే భక్తులలో మరింత మెండుగా ఆధ్యాత్మికత పెంచేలా ఎస్వీ మ్యూజియంను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా మొదటి దశ పనులను పూర్తి చేయాలన్నారు. శ్రీవారి దర్శనం, శ్రీవరాహస్వామివారి దర్శనం, పుష్కరిణి, ఇతర తీర్థాలకు భక్తులు వెళ్లేసమయానికి ముందే ఎస్వీ మ్యూజియాన్ని సందర్శించి స్వామివారి అనుభూతిని పొందేలా రూపకల్పన చేయాలన్నారు.
తిరుమల ఆర్టీసీ బస్సుల టికెట్లలో ఇతర మతాల ప్రచారం జరిగిన అంశంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఆర్టీసీ అధికారులు జాగ్రత్త వహించివుంటే ఇలాంటి తప్పులు జరిగేవి కాదని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మరోసారి ఇలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. పుణ్యక్షేత్రాలలో అన్యమత ప్రచారం జరుగకుండా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పవిత్రపుణ్యక్షేత్రాలలో నిషేధిత వస్తువులను ఉపయోగించరాదని, నిబంధనలను అతిక్రమించరాదని కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్, వేదిక్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ డా. సన్నిధానం సుదర్శన శర్మ, ఎస్వీ మ్యూజియం ఇంఛార్జి కల్నల్ మండా జగన్నాథం, డిప్యూటీ ఈవోలు శ్రీ కస్తూరీ భాయ్, శ్రీమతి సుధారాణి, శ్రీ గోవిందరాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.