ANKURARPANAM OF PAVITHROTSAVAM AT SRI KRT IN VONTIMITTA_ శాస్త్రోక్తంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 30 August 2019: As part of the Pavitrotsavam Of TTD local temple Of Sri Kodandarama Swamy Temple in Vontimetta from August 31-September 2, the traditional ritual of Ankurarpanam was performed on Friday evening.
The three-day event comprising pavitra Homam will be conducted at the yagashala with a host of ritwiks and concludes on September 2nd evening with Veedhi utsavam.
The objective of Pavitrotsavam is to ward off the negative impact of lapses if any occurring during year-long festivities and utsavas in the temple. The artists of HDPP and Annamacharya Project will render Bhakti sangeet, bhajans and kolatas during the festival.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శాస్త్రోక్తంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2019 ఆగస్టు 30: టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలో గల శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, రక్షాబంధనం, మ త్సంగ్రహణం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
అదేవిధంగా ఆగస్టు 31న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు చతుష్టానార్చాన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం 6.00 గంటలకు పవిత్రహోమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 1న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు బాలభోగం, పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 2న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం 5.00 గంటల నుండి స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం జరుగనుంది.
ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.