JEO INSPECTS TTD TEMPLES IN EAST GODAVARI DIST_ తూర్పుగోదావ‌రి జిల్లాలోని టిటిడి ఆల‌యాల‌ను ప‌రిశీలించిన జెఈవో

Tirupati, 30 August 2019: TTD Joint Executive Officer Sri P Basant Kumar on Friday inspected the TTDs managed temples of East Godavari District. They were Sri Ramalayam at Saripall and Sri Padmavathi Sammeta Sri Venkateswara Swamy Temple at Pithapuram.

Earlier during his visit to Sri Ramalayam, he inspected the ongoing repairs at Kalyana mandapam and urged officials to speed up works. He also inspected the works at Pithapuram Kalyana mandapam.

The JEO also directed officials to undertake sanatana dharma programs under the aegis of HDPP.

Executive Engineer Sri Prasad, Deputy EE Sri Lakshmi Narayana, Sthapathi Sri Krishna Rao, Superintendent Sri Haribabu and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తూర్పుగోదావ‌రి జిల్లాలోని టిటిడి ఆల‌యాల‌ను ప‌రిశీలించిన జెఈవో

తిరుపతి, 2019 ఆగస్టు 30: తూర్పుగోదావ‌రి జిల్లాలో టిటిడికి అనుబంధంగా ఉన్న స‌రిప‌ల్లిలోని శ్రీ రామాల‌యం, పిఠాపురంలోని శ్రీ ప‌ద్మావ‌తి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల‌ను శుక్ర‌వారం టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ప‌రిశీలించారు.

ముందుగా స‌రిప‌ల్లిలోని శ్రీ రామాల‌యం, శ్రీ రామ మందిరాన్ని ప‌రిశీలించారు. అక్క‌డున్న టిటిడి క‌ల్యాణ‌మండ‌పంలో జ‌రుగుతున్న మ‌ర‌మ్మతు ప‌నులను ప‌రిశీలించి మెరుగ్గా అభివృద్ధి చేయాల‌ని సూచించారు. అనంత‌రం పిఠాపురంలోని శ్రీ ప‌ద్మావ‌తి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాన్ని సంద‌ర్శించి అక్క‌డి క‌ల్యాణ‌మండ‌పాన్ని ప‌రిశీలించారు. ఈ రెండు ఆల‌యాల్లో హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో మ‌రిన్ని ధార్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని అక్క‌డి అధికారుల‌కు సూచించారు.

జెఈవో వెంట టిటిడి ఇఇ శ్రీ ప్ర‌సాద్‌, డెప్యూటీ ఇఇ శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, స్థ‌ప‌తి శ్రీ కృష్ణారావు, సూప‌రింటెండెంట్ శ్రీ హ‌రిబాబు ఇత‌ర అధికారులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.