ANKURARPANAM OF SRI GT BTU HELD _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 27 May 20: TTD organised Ankurarpanam signalling the commencement of the nine day annual Brahmotsavam of Sri Govindarajaswami temple on Wednesday evening.
Ahead of the Ankurarpanam ritual other events like Senadhipati Utsavam and others held inside the corridors of the temple.
On May 28 Dwajarohanam will be observed in the Mithuna lagnam between 8.00 am and 9.30 am. Bhogi Teru will be held instead of Rathotsavam on June 4. However, TTD has cancelled the ChakraSnanam event at Kapila Thirtam on June 5 in view of Covid-19 restrictions.
TTD has cancelled the vahana sevas on Mada streets held during both morning and evening in view of Coronavirus lockdown procedures.
Special grade Dyeo Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy, superintendent Sri Rajkumar, chief Archaka and Kankana Bhattar Sri A P Srinivasa Dikshitulu and temple inspector Sri Krishnamurthy participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2020 మే 27 : టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 5.00 గంటలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా ఆలయ ప్రాంగణంలోనే సేనాధిపతి ఉత్సవం, ముఖ మండపంలో వేంచేపు, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు.
మే 28న ధ్వజారోహణం :
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన మే 28వ తేదీ గురువారం ఉదయం 8.00 నుంచి 9.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు.
కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉదయం, రాత్రి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపును రద్దు చేశారు. ఈ వాహనసేవలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 4న రథోత్సవానికి బదులు ఆలయ ప్రాంగణంలో భోగితేరు ఉత్సవం నిర్వహిస్తారు. జూన్ 5న కపిలతీర్థంలో చక్రస్నానాన్ని రద్దు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్‌కుమార్, ప్రధాన అర్చకులు మరియు కంకణ భట్టార్ ఏ.పి.శ్రీనివాసదీక్షితులు టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.