ANKURARPANAM ON SEP 22 FOR SRIVARI ANNUAL BTU_ 2017_ సెప్టెంబర్‌ 22న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Tirumala, 20 September 2017: The holy Ankurarpanam ritual will be grandly held on the evening of September 22nd in the Srivari temple to herald the commencement of the nine day festival of Brahmotsavam-2017.

The Viswaroopa Sarvadarshanam will be held on Sep 23 morning the first peritasi Saturday and the Dwajarohanam will be performed in the evening.

Ankurarpanam is a traditional event as per the Vaikhanasa Agama wherein the navadhanya seeds will be kept in a potful of soil to germinate. The second phase of the Ankurarpanam will be conducted as Srivari Asthanam at the Ranganayukula mandapam.

Below are the details of the annual Brahmotsavam vahana sevas:

Date Morning session Evening session
9.00 AM to 11.00 AM 9.00 Pm to 1.00 PM

23-09-2017 Dwajarohanam at 5.48pm
Peddasesha Vahanam

24-09-2017 Chinna Sesha Vahanam Hamsa Vahanam
25-09-2017 Simha Vahanam Muthyapu pandari Vahanam

26-09-2017 Kalpavruksa Vahanam Sarvabhupala Vahanam

27-09-2017 Mohini Avatarram Garuda Vahanam (7.30pm to 1AM)

28-09-2017 Hanumanth Vahanam and Swarna Ratham Gaja Vahanam

29-09-2016 Surya Prabha Vahanam Chandrapraba Vahanam
30-09-2016 Rathotsavam 7.00 AM Aswa Vahanam
01-10-2017 Chakra Snanam 6.00 AM to 9.00 AM Dwajavarohanm

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సెప్టెంబర్‌ 22న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల, 2017 సెప్టెంబర్‌ 20: శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబర్‌ 22వ తేది శుక్రవారం రాత్రి 7.00 నుంచి 8.00 గంటల నడుమ అంకురార్పణ నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 23వ తేది శనివారం ఉదయం విశ్వరూప సర్వదర్శనం, సాయంత్రం 5.48 నుంచి 6.00 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. వైఖానస ఆగమాన్ని పాటించే తిరుమల మరియు ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ.

అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అదేరోజు రాత్రి బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణం (బీజవాపనం) జరుగుతుంది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహనసేవల వివరాలు :

తేది ఉదయం(9గం|| నుండి 11గం|| వరకు) రాత్రి(9గం|| నుండి 11గం|| వరకు)

23-09-2017 విశ్వరూపసర్వదర్శనం సా|| ధ్వజారోహణం (సా|| 5.48 నుంచి 6.00 వరకు),పెద్దశేషవాహనం.

24-09-2017 చిన్నశేష వాహనం హంస వాహనం

25-09-2017 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

26-09-2017 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

27-09-2017 మోహినీ అవతారం గరుడ వాహన (రా.7.30 నుండి 1.00 వరకు)

28-09-2017 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.5 నుండి 7 వరకు) గజవాహనం.

29-09-2016 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

30-09-2016 రథోత్సవం (ఉ.7.00 గం||లకు) అశ్వ వాహనం

01-10-2017 చక్రస్నానం (ఉ.6 నుండి 9 వరకు) ధ్వజావరోహణం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.