ANKURARPANAM PERFORMED FOR PAVITROTSAVAMS_ ఆగస్టు 20, తిరుమల, 2018

Tirumala, 20 August 2018: The Ankurarpanam for three-day annual Pavitrotsavams was observed on Monday evening.

Earlier during the day, Ritwik Varanam was carried out inside the temple.

Speaking to media persons outside the temple, TTD EO Sri Anil Kumar Singhal said, the Pavitrotsavams are observed every year as “Pariharotsavam” or sin free festival to the mistakes committed either knowingly or unknowingly by the religious staffs, non-religious staffs, devotees during the year.

On the first day, Pavitra Pratistha, second day Pavitramala Samarpana and final day Purnahuti are observed as a part of this fete. All arjitha sevas are cancelled during these three days”, EO added.

Temple DyEO Sri Harindranath and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 21 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ఆగస్టు 20, తిరుమల, 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. పవిత్రోత్సవాల అంకురార్పణం సందర్భంగా సోమవారం ఉదయం శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట జరిగిన ఆచార్య ఋత్విక్‌వరణం కార్యక్రమంలో ఈవో పాల్గొన్నారు.

అనంతరం ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ ఋత్విక్‌వరణంలో భాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారని తెలిపారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని వివరించారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయని, 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించిందని వెల్లడించారు.

ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ, చివరిరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారని తెలియజేశారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను రద్దు చేసినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అంకురార్పణం :

శ్రీవారి పవిత్రోత్సవాలకు సోమవారం రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ ఘనంగా అంకురార్పణం జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సేనాధిపతివారిని వసంతమండపానికి వేంచేపు చేసి మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహిస్తారు. ఆ తరువాత పవిత్రమండపంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు.

దోష నివారణ ఉత్సవాలు :

పవిత్రోత్సవాలను ‘దోష నివారణ’, ‘సర్వయజ్ఞ ఫలప్రద’, ‘సర్వదోషోపశమన’, ‘సర్వతుష్టికర’, ‘సర్వకామప్రద’ తదితర పేర్లతో పిలుస్తారు. పవిత్రం, ఉత్సవం అనే రెండు పదాల కలయిక వల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం.

పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారంగానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. ఆలయ మొదటి ప్రాకారంలో గల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. ”పవిత్ర తిరునాల్‌” పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరల వివరాలున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.